Ashish Warang: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి
ABN, Publish Date - Sep 05 , 2025 | 09:35 PM
బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు ఆశిష్ వారంగ్ (Ashish Warang) మృతి చెందాడు. 55 ఏళ్ల ఆశిష్ మృతికి కారణాలు ఏంటి అనేవి ఇంకా తెలియరాలేదు.
Ashish Warang: బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు ఆశిష్ వారంగ్ (Ashish Warang) మృతి చెందాడు. 55 ఏళ్ల ఆశిష్ మృతికి కారణాలు ఏంటి అనేవి ఇంకా తెలియరాలేదు. అతని ఆకస్మిక మరణవార్తా విన్న బాలీవుడ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆశిష్.. బాలీవుడ్ లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో ఆశిష్ నటించాడు. అక్షయ్ కుమార్ (Akshay Kumar)నటించిన సూర్యవంశీ, దృశ్యం, మర్దానీ, ఏక్ విలన్ లాంటి సినిమాలు ఆశిష్ కు మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టాయి.
హిందీలోనే కాకుండా మరాఠీ చిత్రాల్లో కూడా ఆశిష్ నటించి మెప్పించాడు. ఇంకెంతో మంచి గుర్తింపు తెచ్చుకోవాల్సిన ఆశిష్ ఇలా అర్ధాంతరంగా మృతిచెందడం ఎంతో బాధకరమని పలువురు ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆశిష్ మృతికి కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియరాకపోవడంతో బాలీవుడ్ మీడియా ఏవేవో అనుమానాలను వ్యక్తం చేస్తుంది. మరి ఆశిష్ వారంగ్ మరణానికి కారణం ఏంటి అనేది త్వరలోనే తెలుస్తుందేమో చూడాలి.