Vijaya Ramaraju: విడుదలైన 'అర్జున్ చక్రవర్తి' టైటిల్ సాంగ్
ABN , Publish Date - Aug 17 , 2025 | 11:09 AM
విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి' . విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని శ్రీని గుబ్బల నిర్మించారు.
విజయ రామరాజు (Vijaya Rajaraju) టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి' (Arjun Chakravarthy). విక్రాంత్ రుద్ర (Vikrant Rudra) దర్శకత్వం వహించిన ఈ సినిమాని శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి. ఇటీవలే రిలీజై అయి టీజర్ కు, ఫస్ట్ సింగిల్ కు మంచి స్పందన లభించింది. దాంతో మేకర్స్ తాజాగా ఆంథమ్ ఆఫ్ అర్జున్ చక్రవర్తి' వీడియోను విడుదల చేశారు. విఘ్నేష్ భాస్కరన్ (Vignesh Baskaran) ఈ సినిమాకు సంగీతం సమకూర్చగా, తాజా గీతాన్ని దర్శకుడు విక్రాంత్ రుద్ర రాశారు. దీనిని దీపక్ బ్లూ, 'బిగ్ బి' సత్యకుమార్, విన్నేష్ పాయ్ పాడారు. ఈ సినిమాలో విజయ రామరాజు, సిజా రోజ్ జంటగా నటించగా, ఇతర ప్రధాన పాత్రలను హర్ష్ రోషన్, అజయ్, అజయ్ ఘోష్, దయానంద్ రెడ్డి పోషించారు. ఈ చిత్రానికి జగదీష్ చీకాటి డీవోపీ, ప్రదీప్ నందన్ ఎడిటర్ , సుమిత్ పటేల్ ప్రొడక్షన్ డిజైనర్. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న 'అర్జున్ చక్రవర్తి' మూవీ ఆగస్ట్ 29న విడుదల కాబోతోంది.