Bhumi pednekar: వయసులో చిన్నాడైతే ఏంటి.. కంఫర్ట్‌గా ఉంది..
ABN, Publish Date - May 12 , 2025 | 08:57 PM
ఈ క్రమంలోనే తన కన్నా చిన్నవాడితో రొమాంటిక్ సీన్స్‌లో నటించడంపై భూమీకి ఓ ప్రశ్న ఎదురైంది.
బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్(Bhumi pednekar) తన కన్నా ఆరేళ్ల చిన్న అయిన యువ కథానాయికుడు ఇషాన్ ఖత్తర్‌తో (Ishan kattar) కలిసి 'ది రాయల్స్’ (the Royals) వెబ్ సిరీస్‌లో నటించింది. రొమాంటిక్ సిరీస్‌గా తెరకెక్కిన ఇందులో ఇషాన్‌తో రెచ్చిపోయి మరీ ఇంటిమేట్ సీన్ చేసింది. ఈ క్రమంలోనే తన కన్నా చిన్నవాడితో రొమాంటిక్ సీన్స్‌లో నటించడంపై భూమీకి ఓ ప్రశ్న ఎదురైంది. అందుకు ఆమె.. ఇంటిమేట్ సీన్స్‌లో నటించడం అనేది చిన్న విషయం కాదు. అలాంటి సీన్స్‌లో ఇమిడిపోయి నటించడానికి ప్రయత్నిస్తుంటాం. తనకు కంఫర్ట్ లేకపోతే ఆ సన్నివేశం ఫేక్‌గా ఉంటుంది. అందుకే ఆ వెబ్ సిరీస్‌లో నటించడానికి ముందే ఇషాన్ ఖత్తర్‌తో క్లోజ్‌గా ఉన్నాను. అతనితో కంఫర్ట్ ఉంది. నాకు కంఫర్ట్‌గా అనిపించాడు. అందుకే రొమాన్స్ చేశా’’ అని తెలిపింది. ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ దాదాపు 6 ఏళ్లు. ఇషాన్ ఖత్తర్ కంటే భూమి పెడ్నేకర్ ఆరేళ్ళు పెద్ద. అయినా రొమాన్స్ ఇరగదీశారని నెటిజన్లు కామెంట్ చేశారు.