సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Bigg Boss 19: బిగ్‌బాస్ 19 విన్న‌ర్‌.. గౌరవ్ ఖన్నా

ABN, Publish Date - Dec 08 , 2025 | 03:53 PM

బిగ్‌బాస్ హిందీ సీజన్ 19 గ్రాండ్ ఫినాలేలో టీవీ నటుడు గౌరవ్ ఖన్నా (Gaurav Khanna) విజేతగా నిలిచారు.

Bigg Boss 19

బిగ్‌బాస్ హిందీ సీజన్ 19 గ్రాండ్ ఫినాలేలో టీవీ నటుడు గౌరవ్ ఖన్నా (Gaurav Khanna )విజేతగా నిలిచారు. భారీ ఉత్కంఠ మధ్య హోస్ట్ సల్మాన్ ఖాన్ గౌరవ్ పేరును ప్రకటించగానే హౌస్‌లో సంబరాలు మిన్నంటాయి. ఫర్హానా భట్ రన్నరప్‌గా నిలిచింది. ఈ సంద‌ర్భంగా విజేత‌కు రూ.50 లక్షల ప్రైజ్ మనీతో పాటు బిగ్‌బాస్ ట్రోఫీ గెలుచుకున్నారు.

100 రోజుల‌కు పైగా న‌గిచిన ఈషోలో చివ‌ర‌కు టాప్‌-5లో గౌరవ్ ఖన్నా, ఫర్హానా భట్ (Farrhana Bhatt), అమల్ మల్లిక్ (Amaal Mallik), తాన్యా మిట్టల్, ప్రణిత్ మోర్ నిల‌వ‌గా ప్రేక్షకుల ఓటింగ్‌తో గౌరవ్‌ ఖన్నా విజేతగా నిలిచాడు. అయితే.. గౌర‌వ్ ఖ‌న్నా ఇప్ప‌టికే హిందీ టాప్ సీరియ‌ల్స్‌‘అనుపమ’, ‘సీఐడీ’ ల ద్వారా విశేష‌మైన గుర్తింపు ఉండడం విశేషం.

అంతేగాక‌ ఈ సీజన్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న కంటెస్టెంట్లలో ఆయన ఒకరు కాగా వారానికి రూ.17.5 లక్షలు తీసుకున్నట్లు స‌మాచారం. ఇంకా.. ఇంతకుముందు జరిగిన సెలబ్రిటీ మాస్టర్‌ చెఫ్ షోలో కూడా గౌరవ్ 12 మందిని ఓడించి టైటిల్‌ గెలుచుకున్నారు. రియాలిటీ షోలలో వరుస విజయాలతో తన క్రేజ్‌ను మరింత పెంచుకున్నారు.

Updated Date - Dec 08 , 2025 | 05:11 PM