Salman-vs-yash: బాక్సాఫీస్ బ్లాస్ట్ కన్ఫామ్.. ఈద్ బరిలో స్టార్ హీరోస్
ABN, Publish Date - Nov 25 , 2025 | 07:30 PM
నెక్స్ట్ఇ యర్ భారీ బ్లాస్ట్ కాబోతోంది. సమ్మర్ రాక ముందే దేశమంతా భారీగా వేడెక్కనుంది. బాక్సాఫీస్ వద్ద రెండు భారీ సినిమాలు ఢీకొట్టుకోబోతుండటంతో.. ఆడియెన్స్ అంతా స్టన్ అయిపోతున్నారు. స్టారాధిస్టారులు ఒకేరోజు పోటీపడుతుండటంతో ఏం జరుగుతుందా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు..
వచ్చే ఏడాది ఈద్ పండగకు.. భారతీయ సినిమా పరిశ్రమలో భారీ బాక్సాఫీస్ వార్ జరగబోతోంది. ఎవరూ ఊహించని సినిమాలు ఢీకొట్టుకోబోతున్నాయి. బాలీవుడ్ దిగ్గజం సల్మాన్ ఖాన్, కన్నడ సూపర్‌స్టార్ యశ్ ఒకే రోజు తమ మోస్ట్ అవెయిటెడ్ మూవీలతో రంగంలోకి దిగబోతున్నారు. రెండు చిత్రాల బృందాలు రిలీజ్ తేదీని అధికారికంగా ద్రువీకరించడంతో ఏం జరగనుందా అన్న ఉత్కంఠ నెలకొంది.
కొంతకాలంగా ప్లాఫులతో సతమతం అవుతున్న కండలవీరుడు సల్మాన్ ఖాన్ (Salman khan)'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' మూవీతో అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. కశ్మీర్‌లో కఠిన వాతావరణ పరిస్థితుల్లో జరిపిన షూటింగ్‌తో ఈ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటికే చర్చనీయాంశమైంది. ఈద్ సందర్భంగా విడుదలవుతున్న సల్మాన్ 17వ చిత్రం ఇది కావడం విశేషం. డిసెంబర్ నాటికి చిత్రీకరణ పూర్తయి, పోస్ట్-ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగవంతం కానున్నాయి. అపూర్వ లఖియా దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ మార్చి 19న రానుంది.
‘కేజీఎఫ్ చాప్టర్-2’ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత యశ్ చేస్తున్న సినిమా ' టాక్సిక్'. ఈ మూవీ కూడా మార్చి 19, 2026 రిలీజ్ తేదీ రిలీజ్ కానున్నట్లు మేకర్స్ కన్ఫామ్ చేశారు. పాన్ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఏర్పరచిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ మళయాళ దర్శకురాలు గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తుండగా.. కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తోంది.ఈ రెండు చిత్రాలు దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో ఆక్యుపై చేసుకునే అవకాశం ఉంది. ఈద్ హాలిడే అడ్వాంటేజ్‌తో రెండూ రికార్డు స్థాయి ఓపెనింగ్స్ సాధించే ఛాన్ప్ కనిపిస్తోంది. అయితే బాక్సాఫీస్ ఫలితాలు, ఆదరణ, లాంగ్ రన్‌లో ఎవరు ఆధిపత్యం చెలాయిస్తారన్నది మాత్రం మార్చి 19 తర్వాతే తేలనుంది.