Aryan Khan: షారుఖ్ కుమారుడు తక్కువేం కాదుగా.. సెటైర్లతో బాలీవుడ్‌పై విరుచుకు పడ్డాడు
ABN, Publish Date - Aug 21 , 2025 | 03:30 PM
షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో రూపొందుతున్న తొలి సినిమా “ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్”.
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) తనయుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) హీరోగా ఎంట్రీ ఇస్తాడని అందరూ భావించారు. కానీ ఆశ్చర్యం కలిగిస్తూ ఆయన డైరెక్టర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న తొలి సినిమా “ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్”. ఈ చిత్రంలో ఇటీవల కిల్ సినిమాతో అలరించిన హీరో, విలన్ పాత్ర ధారులు లక్ష్య (Lakshya), రాఘవ్ జుయల్ (Raghav), మరోసారి తెర పంచుకోగా బాబీ డియోల్, షహెర్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. షారుఖ్ ఖాన్ స్వయంగా టీజర్‌ను లాంచ్ చేయగా, ఓపెనింగ్ నరేషన్ కూడా ఆయనే ఇచ్చారు.
టీజర్‌ను పరిశీలిస్తే.. ఆరంభమే షారుఖ్ వాయిస్‌తో ఆసక్తికరంగా ప్రారంభమయింది. లక్ష్యను ‘అస్మాన్ సింగ్’ అనే కొత్త హీరోగా పరిచయం చేశారు. బాబీ డియోల్ (Bobby Deol) సూపర్‌స్టార్ అజయ్ పాత్రలో కనిపించి హైలైట్ అయ్యాడు. ఈ సినిమా అంతా బాలీవుడ్ సినిమాలు, స్టార్లు బయటకు కనిపించే వారి రాయల్ లైఫ్, లోలోపల జరిగే కహానీల నేపథ్యంలో నర్మగర్బంగా, సెటైరికల్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. విజువల్స్, ప్రజంటేషన్, డైలాగ్స్ అన్నీ అదిరిపోయాయి. టీజర్ చివరలో బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, రణ్ వీర్ సింగ్ స్పెషల్ గ్లింప్స్‌లో మెరిసిపోగా, కరణ్ జోహార్ కూడా ఓ క్విక్ అప్పియరెన్స్‌తో ఆకట్టుకున్నారు. అన్నింటికా మించి ఇది ఓ కొత్త డైరెక్టర్ తీస్తున్న సినిమాలా కాక ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి తీసిని చిత్రంలా ఉండడం గమనార్హం.
కాగా ఈ సినిమా.. థియేటర్‌లోకి కాకుండా సెప్టెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుంది. అయితే.. బాలీవుడ్ బాద్‌షా కుమారుడు అర్యన్ ఖాన్ హీరోగా వచ్చి తండ్రి వారసత్వాన్ని కంటిన్యూ చేస్తాడనుకుంటే సడన్‌గా దర్శకుడిగా అవతార మెత్తి సినిమా తీయడంతో బాలీవుడ్ కాస్త షాక్‌లో ఉంది. అంతేగాక ఇప్పుడు ఈ సినిమా, బాలీవుడ్ అభిమానుల్లో పెద్ద ఎక్స్‌పెక్టేషన్ క్రియేట్ చేసింది. టీజర్ చూస్తుంటే ఆర్యన్ ఖాన్ డైరెక్టర్స్ లిస్టులో ప్రత్యేక స్థానం సంపాదించగలడనే భావన కలుగుతోంది. మొత్తానికైతే.. “ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్” టీజర్ సక్సెస్‌ఫుల్‌గా హైప్ క్రియేట్ చేసింది. సినిమా కంటెంట్ కూడా అదే స్థాయిలో ఉంటే ఆర్యన్ ఖాన్‌కు డైరెక్టర్‌గా శుభారంభం ఖాయం అన్న మాట.