సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Amrita Rao: రక్తంతో లవ్ లెటర్.. భయపడిన మహేష్ హీరోయిన్

ABN, Publish Date - Sep 24 , 2025 | 07:57 PM

ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరోయిన్ కి సక్సెస్ తరువాత ఎంతోకొంత ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఉంటుంది. దానిని ఎంజాయ్ చేయడానికి కూడా కొందరు ధైర్యం చేయలేరు.

Amrita Rao

Amrita Rao: ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరోయిన్ కి సక్సెస్ తరువాత ఎంతోకొంత ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఉంటుంది. దానిని ఎంజాయ్ చేయడానికి కూడా కొందరు ధైర్యం చేయలేరు. ఎందుకంటే కొంతమంది ఫ్యాన్స్ వారిని అంతలా భయపెడతారు. బాలీవుడ్ నటి అమృతా రావు (Amrita Rao) కూడా అలాంటి భయంకరమైన ఘటనలను చూసినట్లు చెప్పుకొచ్చింది. ఒక సినిమా సక్సెస్ అయితే.. మమ్మల్ని పెళ్లి చేసుకో.. నన్ను ప్రేమించు అంటూ వెంటపడే అబ్బాయిలు కోకొల్లలు. ఇది అందరి హీరోయిన్స్ జీవితంలో జరిగిదే. అయితే అమృతా రావుకు కొద్దిగా ఎక్కువ జరిగినట్లు ఆమె చెప్పుకొచ్చింది.


అమృతా రావు.. వివాహ్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా 2006 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఆ తరువాత ఎన్నోహిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక తెలుగులో మహేష్ బాబు సరసన అతిధిలో నటించింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో అమృతా తెలుగులో మరోసారి కనిపించలేదు. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ప్రేమించిన వ్యక్తిని పెళ్ళాడి.. ప్రస్తుతం హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తుంది.


తాజాగా ఆమె అక్షయ్ కుమార్ నటించిన జాలీ ఎల్ఎల్‌బి 3లో ఆమె నటించింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో అమృతా.. వివాహ్ సక్సెస్ తరువాత తనకు వచ్చిన పెళ్లి ప్రపోజల్స్ గురించి చెప్పుకొచ్చింది. అందులో ఒక వ్యక్తి తనకు రక్తంతో రాసిన లవ్ లెటర్ పంపాడని, అది చూసి తాను భయపడినట్లు చెప్పుకొచ్చింది. ' వివాహ్ భారీ విజయం తరువాత నన్ను చాలామంది పెళ్లి చేసుకుంటామని వచ్చారు. కుక్కల పక్కన, కార్ల పక్కన నిలబడి ఫోటోలు తీసుకొని పంపించేవారు.


ఇక ఎన్నారై సంబంధాలు కూడా చాలా వచ్చాయి. ముఖ్యంగా ఒక వ్యక్తి అయితే నాకు రక్తంతో లవ్ లెటర్ రాసి పంపించాడు. అది చాలా భయానకంగా ఉంది. చాలా భయమేసింది. ఇక వీతిహతో పాటు మా ఇంటికి చాలామంది ఫోన్ చేసేవారు. ఒక వ్యక్తి అయితే మా ఇంటిముందు టెలిఫోన్ బూతు వద్దనే ఉండేవాడు. మా అమ్మానాన్నలకు ఆ కాల్స్ చాలా ఇబ్బందిగా అనిపించేవి' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Reba Monica John: కూలీ.. చాలా డిస్సప్పాయింట్ అయ్యాను

OG Release: ఉత్తరాంధ్ర  'ఓజీ' రిలీజ్ హవా  పవన్ అభిమానిదే 

Updated Date - Sep 24 , 2025 | 07:57 PM