సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Bollywood: అమితాబ్ బ‌చ్చ‌న్.. డాన్ ద‌ర్శ‌కుడు క‌న్నుమూత‌

ABN, Publish Date - Jul 20 , 2025 | 02:31 PM

హిందీ సినిమా ఇండ‌స్ట్రీలో విషాదం నెల‌కొంది. అల‌నాటి మేటి చిత్రం డాన్ ద‌ర్శ‌కుడు చంద్రా బరోట్ క‌న్నుమూశారు.

don ChandraBarot

హిందీ సినిమా ఇండ‌స్ట్రీలో విషాదం నెల‌కొంది. భార‌తీయ సినిమాకు వ‌న్నె తెచ్చిన అల‌నాటి మేటి చిత్రం డాన్ (Don) ద‌ర్శ‌కుడు చంద్రా బరోట్ (86) (Chandra Barot) క‌న్నుమూశారు. గ‌త కొంత కాలంగా పల్మనరీ ఫైబ్రోసిస్ తో భాధ ప‌డుతున్న ఆయ‌న ఆదివారం ఉద‌యం ఆస్ప‌త్రిలో చికిత్ప పొందుతూ తుదిశ్వాస విడిచాడు. భారతీయ సినీ ప్రపంచంలో కొన్ని సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటాయి. అలాంటి క్లాసిక్ హిట్‌లలో ఒకటి డాన్ (Don 1978). ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు చంద్రా బరోట్ నేటి తరం ప్రేక్షకులకు పెద్దగా పరిచయం కాకపోయినా బాలీవుడ్‌లో తనకంటూ చిర‌స్థాయిగా నిలిచేలా ప్ర‌త్యేక‌ ముద్రను లిఖించుకున్నాడు.

చంద్రా బరోట్ 1940లో గుజరాత్‌లో జన్మించిన ఆయ‌న బాల్యం నుంచే సినిమా, థియేటర్ యాక్టింగ్‌పై ఆసక్తి ఆయన ముంబై వ‌చ్చి ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. త‌క్కువ స‌మ‌యంలోనే అంచ‌లు అంచెలుగా ఎదుగుతూ 1970లో అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యారు. ఆపై మ‌నోజ్ కుమార్ న‌టించిన , నిర్మించిన‌ నాలుగు సినిమాల‌కు ప‌ని చేశారు. ఆ అనుభవంతో అనుకోకుండా వ‌చ్చిన అవ‌కాశంతో 1978 లో డాన్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించి బాలీవుడ్ చరిత్రలో ఒక లెజెండరీ మూవీగా నిలిపారు.

ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ద్విపాత్రాభినయం చేయ‌గా, సలీమ్-జావేద్ (Salim–Javed) రాసిన ఈ స్క్రిప్ట్‌ను చంద్రా బరోట్ అద్భుతంగా తెరకెక్కించారు. రిలీజ్ అయిన తర్వాత బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించి ఇండ‌స్ట్రీ హిట్ సాధించ‌డ‌మే గాక అనేక‌ రికార్డులు తిర‌గ‌రాసిన ఈ మూవీ అటుపై తెలుగులో ఎన్టీఆర్ హీరోగా యుగంధ‌ర్‌, ప్ర‌భాస్ బిల్లా, త‌మిళంలో అజిత్ బిల్లాగా తెర‌కెక్కింది. అంతేకాదు హిందీలోనే షారుఖ్ హీరోగా రీమేక్ చేశారు.

ఇదిలాఉంటే.. డాన్ వంటి సంచ‌ల‌న విజ‌యవంత‌మైన మూవీ త‌ర్వాత బెంగాలీలో ఓ సినిమా చేసిన ఆయ‌న మంచి హిట్ కొట్టారు. కానీ ఆ త‌ర్వాత ఆయ‌న మ‌రో మూడు చిత్రాలు డైరెక్ట్ చేసినా అవి రిలీజ్‌కు కూడా నోచుకోక పోవ‌డం గ‌మ‌నార్హం. దాంతో ఆయ‌న సినిమాలకు గుడ్ బై చెప్పి. డాక్యుమెంటరీలు, అడ్వర్టైజింగ్ రంగాల్లో కొనసాగారు. అయినప్పటికీ, ఒకే సినిమా ఆయనకు చిరస్థాయి గుర్తింపును తెచ్చింది. అయితే.. చంద్రా బరోట్ పేరు ఎక్కువ మందికి తెలియకపోయినా, ఆయన తీసిన డాన్ మాత్రం బాలీవుడ్ చరిత్రలో గోల్డెన్ పేజీలో నిలిచిపోయింది.

Updated Date - Jul 20 , 2025 | 02:31 PM