Alia Bhatt: మరో తెలుగు సినిమాలో.. ఆలియాభట్! నిజమేనా
ABN, Publish Date - Oct 11 , 2025 | 10:20 AM
ప్రభాస్ హీరోగా (Prabhas) నాగ్ అశ్విన్ (Nag ashwin) తెరకెక్కించిన ‘కల్కి’ చిత్రం భారీ విజయం సాధించింది. పలు కారణాల వల్ల బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె ఈ చిత్రంలో భాగం కాదని నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఇప్పుడు ఆ స్థానంలో ఎవరు వస్తారా అనే చర్చ మొదలైంది
ప్రభాస్ హీరోగా (Prabhas) నాగ్ అశ్విన్ (Nag ashwin) తెరకెక్కించిన ‘కల్కి’ చిత్రం భారీ విజయం సాధించింది. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రానికి సీక్వెల్‌గా ‘కల్కి 2898 పార్ట్ 2’ (Kalki 2)తెరకెక్కబోతుంది. అయితే పలు కారణాల వల్ల బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె ఈ చిత్రంలో భాగం కాదని నిర్మాణ సంస్థ వెల్లడించింది. అప్పటి నుంచి పార్ట్2లో హీరోయిన్ అవకాశం ఎవరు దక్కించుకుంటారనే చర్చ సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతోంది. ఇప్పుడు ఈ చిత్రం గురించి మరో వార్త వైరల్ అవుతోంది. దీపిక స్థానాన్ని భర్తీ చేయడానికి బాలీవుడ్ క్యూటీ అలియాభట్‌ను (Alia Bhatt( దర్శక నిర్మాతలు సంప్రదించారని వార్తలు వస్తున్నాయి.
అంతా అనుకున్నట్లు జరిగితే ఆలియాభట్ ఈ చిత్రంలో కథానాయికగా ఫిక్స్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఆలియాకు తెలుగు సినిమా వర్క్ అట్మాస్పియర్ గురించి తెలుసు. ఇప్పటికే ఆమె 'ఆర్ఆర్ఆర్'లో నటించి మెప్పించింది. 'కల్కి2'లో సుమతి రోల్‌కు ఆమె యాప్ట్ అవుతుందని దర్శకుడు భావిస్తున్నారట. అయితే ఈ విషయంపై నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి స్పందన లేదు. నెటిజన్లు మాత్రం ‘ఆలియా ఇది నిజమేనా?’ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు.