Alia Bhatt: ఆలియా భట్ ఇంట్లో.. దీపావళి సెలబ్రేషన్స్!
ABN, Publish Date - Oct 20 , 2025 | 01:37 PM
బాలీవుడ్ స్టార్ ఆలియా భట్ తన ఇంట్లో గ్రాండ్ దీపావళి వేడుకలు జరిపి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. కరీనా, కరిష్మా కపూర్ వంటి స్టార్లు హాజరైన ఈ సంబరాలు నెటిజన్లను మంత్ర ముగ్ధులను చేశాయి.
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ (Alia Bhatt) మరోసారి దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. అయితే ఈ సారి తన అందం, సినిమాలతో కాదు. దీపావళి సందర్భంగా ఈ భామ తన ఇంట్లో గ్రాండ్‌గా దీపావళి వేడుకలు జరిపింది. స్నేహితులు, బంధుమిత్రులతో కలిసి సంబరాలు చేసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. గోల్డెన్ కలర్ అవుట్‌ఫిట్‌లో మెరిసిపోయిన ఆలియా.. తన అందంతో నెటిజన్లను ఫిదా చేసింది.
ఈ వేడుకకు కరీనా కపూర్, కరిష్మా కపూర్, అలేఖ వాణి జైన్, నందనీ తాషా, అనీషా మల్హోత్రా జైన్, నీతూ కపూర్ వంటి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
అందరితో కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. తన సహనటుడు రణబీర్ కపూర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అలియా ఓ పాపకు తల్లైనా సినిమాలు మాత్రం ఎలాంటి ఆటంకాలు లేకుండా బిజీగా దూసుకుపోతోంది.
తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్‌గా ఎదిగి, భారీ పారితోషకం అందుకుంటున్న నటిగా నిలిచిన ఈ ముద్దుగుమ్మ అందంతోపాటు నటనలో కూడా సత్తా చాటింది. ‘ఆర్ఆర్ఆర్’లో రామ్ చరణ్ మరదలిగా నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించింది.
ప్రస్తుతం ఒక బిడ్డకు తల్లి అయినా కూడా తన ఫిట్‌నెస్, ఫ్యాషన్‌తో అభిమానులను మంత్ర ముగ్ధులను చేస్తున్న ఆలియా “తల్లి అయిన తర్వాత మరింత అందంగా మారిందంటూ” నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.