Haiwaan: అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్  'హైవాన్' షురూ 

ABN , Publish Date - Aug 23 , 2025 | 01:57 PM

అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ 17 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్నారు. ప్రియదర్శన్ దర్శకత్వంలో హైవాన్ మూవీతో వీరిద్దరూ తెరపై సందడి చేయనున్నారు 

Haiwaan Movie pooja

అక్షయ్ కుమార్(Akshay kumar), సైఫ్ అలీ ఖాన్ (Saif ali khan) ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ 'హైవాన్' (Haiwaan) చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సరికొత్త థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయ్ ఫెన్ నిర్మాతలు.  రెగ్యులర్ షూటింగ్ శనివారం   కొచ్చిలో ప్రారంభమైంది. ఊటీ, ముంబైలలో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకోనుంది. 

IMG_4505.jpg

హైవాన్ మూవీతో అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ 17 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాలో నటించడం ఎగ్జైటింగ్ గా ఉందని సోషల్ మీడియా ద్వారా అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ తెలిపారు. హైవాన్ చిత్రాన్ని టాప్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. 

Updated Date - Aug 23 , 2025 | 03:41 PM