Son Of Sardaar 2: అజయ్ దేవగణ్.. సన్ ఆఫ్ సర్దార్ 2 ట్రైలర్
ABN, Publish Date - Jul 11 , 2025 | 01:43 PM
అజయ్ దేవగణ్, మృణాల్ జంటగా రూపొందిన చిత్రం సన్ ఆఫ్ సర్దార్ 2 ట్రైలర్ శుక్రవారం రిలీజ్ చేశారు.
దశాబ్దం క్రితం సునీల్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన మర్యాద రామన్న చిత్రాన్ని అజయ్ దేవగణ్ (Ajay Devgn) బాలీవుడ్‌లో సన్ ఆఫ్ సర్దార్‌గా రీమేక్ చేసి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిదే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా సన్నాఫ్ సర్దార్ 2 (Son of Sardaar -2) అంటూ మరో చిత్రాన్ని రూపొందించారు.
మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కథానాయికగా నటిస్తోంది. విజయ్ కుమార్ అరోరా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా జూలై 25న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పాటలు, టీజర్ మంచి రెస్పాన్స్ దక్కించుకోగా తాజాగా శుక్రవారం ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చేస్తూ ఆసాంతం మంచి కామెడీ ప్రధానంగా సాగింది.