సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Celena Jaitley: మిడిల్ ఈస్ట్‌లో నిర్బంధంలో ఉన్న మా సోద‌రుడిని విడిపించండి.. బాలీవుడ్ న‌టి భావోద్వేగం

ABN, Publish Date - Nov 24 , 2025 | 03:55 PM

మిడిల్ ఈస్ట్‌లో నిర్బంధంలో ఉన్న తన సోదరుడు మేజర్ విక్రాంత్ పరిస్థితిపై బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ భావోద్వేగంగా స్పందించారు. ప్రభుత్వాన్ని వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

Celina Jaitly

ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి సెలీనా జైట్లీ (Celina Jaitly), ఏడాదికి పైగా మిడిల్ ఈస్ట్‌లో నిర్బంధంలో చిక్కుకుపోయిన తన సోదరుడు మేజర్ విక్రాంత్ కుమార్ జైట్లీ (రిటైర్డ్) (Major Vikrant Jaitly) ప‌రిస్థితి వివ‌రిస్తూ తీవ్ర భావోద్వేగం వ్య‌క్తం చేసింది. తన వేదనను సోషల్ మీడియాలో షేర్ చేసి అక్క‌డ తన సోదరుడు ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణలను కూడా మెన్షన్ చేసింది. 2024 నుండి మిడిల్ ఈస్ట్‌లో నిర్బంధంలో ఉన్న తన సోదరుడు విక్రాంత్ కుమార్ జైట్లీకి ఏమి జరుగుతుందనే భయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

ఆమె త‌న పోస్టులో.. నా సోదరుడు మేజర్ విక్రాంత్ కుమార్ జైట్లీని నిర్బంధంలోకి తీసుకుని ఇప్పటికి ఒక‌ సంవత్సరం, 2 నెలల 17 రోజులు మొత్తంగా 443 రోజులు 10,632 గంటలు, 637,920 నిమిషాలు అయ్యాయి అని ఆమె పేర్కొంది. విక్రాంత్ అపహరణకు గురైనప్పటి నుంచి నా జీవితంలో భయం, ఆశ భరించలేని నిశ్శబ్దం నెల కొన్నాయ‌ని. అతని గొంతు వినడానికి, అతని ముఖం చూడటానికి ఎదురు చూస్తున్నాన‌ని, అతన్ని ఎవరు ఏం చేశారో నేను భయపడుతున్నాను అంటూ సెలీనా భావోద్వేగంగా చెప్పారు.

మన సైనికులు.. విదేశాల్లో సులువైన లక్ష్యాలుగా మారుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం వ్యక్తిగత సమస్య కాదని, జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా మారిందని సెలీనా పేర్కొన్నారు. మన నౌకాదళ సభ్యులను ప్రభుత్వం సురక్షితంగా ఇంటికి తిరిగి తీసుకువచ్చినట్లే, ఈ సైనికుడిని కూడా భారత్‌కు తీసుకురావాలి. ఏ భారత సైనికుడూ తక్కువ కాదని, ఖతార్‌లో తీసుకున్న అదే నిర్ణయాత్మక చర్య ఇక్క‌డా కూడా అవసరమ‌ని ఆమె అన్నారు. ఈ జాతికి సర్వస్వం అందించిన వ్యక్తిని మౌనంగా విడిచిపెట్టవద్దని ఆమె కోరారు.

ఇదిలా ఉండగా, మేజర్ (రిటైర్డ్) విక్రాంత్ కుమార్ జైట్లీ పరిస్థితిపై నాలుగు వారాల్లోగా స్టేటస్ రిపోర్టును సమర్పించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. ఆ నోటీసు జారీ అయిన కొద్ది రోజులకే సెలీనా ఈ పోస్ట్ చేసింది. భారతీయ అధికారుల నుండి తన సోదరుడికి సరైన చట్టపరమైన మరియు వైద్య సహాయం కోసం అభ్యర్ధిస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. దీనికి ప్రతిస్పందనగా, మేజర్ జైట్లీ పరిస్థితిని ట్రాక్ చేయడానికి మరియు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వ‌డానికి ఓ నోడల్ అధికారిని నియమించాలని కోర్టు ఆదేశించింది. కాగా ఈ కేసు డిసెంబర్ 4న మరలా విచారణకు రానుంది. తన సోదరుడిని కిడ్నాప్ చేసి అబుదాబిలో ఉంచారని, అక్కడ అతను గత 14 నెలలుగా చట్టపరమైన, వైద్య సహాయం లేకుండా నిర్బంధించబడ్డాడని, నా సోదరుడు భారత నేలపైకి తిరిగి వచ్చే వరకు నేను ఆగను” అని సెలీనా తన పోస్ట్‌లో చెప్పింది.

Updated Date - Nov 24 , 2025 | 03:59 PM