Abhishek Bachchan: రక్త, స్వేదం చిందించటం.. కన్నీళ్లే నాకు తెలుసు
ABN, Publish Date - Oct 30 , 2025 | 11:48 AM
నెటిజన్ కామెంట్‌కు అభిషేక్ అదిరిపోయే రియాక్షన్.. సినిమా సెలబ్రిటీలపై ట్రోలింగ్ అనేది సహజం. సినిమా వాళ్లను టార్టెగ్ చేస్తూ ప్రతి విషయంపైనా స్పందిస్తూ సినిమా ఇండస్ట్రీలో ఆడ, మగ అనే తేడా లేకుండా ట్రోల్ చేస్తుంటారు.
నెటిజన్ కామెంట్‌కు అభిషేక్ అదిరిపోయే రియాక్షన్..
సినిమా సెలబ్రిటీలపై ట్రోలింగ్ అనేది సహజం. సినిమా వాళ్లను టార్టెగ్ చేస్తూ ప్రతి విషయంపైనా స్పందిస్తూ సినిమా ఇండస్ట్రీలో ఆడ, మగ అనే తేడా లేకుండా ట్రోల్ చేస్తుంటారు. అయితే వీటిని కొందరు లైట్‌గా తీసుకుంటారు. మరికొందరు సీరియస్‌గా తీసుకుని రియాక్ట్ అవుతుంటారు. తాజాగా ట్రోలింగ్‌పై బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachan) రియాక్ట్ అయ్యారు. ఆయన సినిమా ఆడినా, ఆగకపోయినా నెటిజన్లు కామెంట్స్ చేస్తూనే ఉంటారు. సుజీత్ సర్కార్ దర్శకత్వంలో అభిషేక్ బచ్చన్ నటించి ‘ఐ వాంట్ టు టాక్’ చిత్రంలో ఆయన నటనకు గానూ అబిషేక్‌ను ఫిల్మ్‌ఫేర్ అవార్డు వరించింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ అభిషేక్‌ను ట్యాగ్ చేస్తూ విపరీతంగా విమర్శించారు. అభిషేక్ అవార్డులు కొనుక్కుంటారిన కామెంట్ చేశారు. దీనిపై ఆయన తనదైన శైలిలో స్పందించారు. (Netizen comments on Abhishek bachan)
నెటిజన్ ఏమన్నాడంటే ‘అభిషేక్ ఎంతో మంచి వ్యక్తి, స్నేహశీలి అని విన్నాను. అయినా నటుడిగా ఆయనంటే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అవార్డులు కొనుక్కోవడం, కెరీర్‌లో సోలో బ్లాక్‌బస్టర్ లేకపోయినా, పీఆర్ ద్వారా ఎప్పుడూ అతని గురించి ఇండస్ట్రీలో మాట్లాడుకునేలా ప్లాన్ చేసుకుంటాడు. ఈ ఏడాది ఆయనకు ‘ఐ వాంట్ టు టాక్’ సినిమాకు ఫిల్మ్‌ఫేర్ వచ్చింది. డబ్బులు తీసుకున్న కొంతమంది విమర్శలకు తప్ప ఆ సినిమా ఎవ్వరూ చూడలేదు. కానీ సోషల్‌మీడియాలో హడావిడి చూేస్త, 2025 అభిషేక్ ఇయర్ అంటూ నానా రచ్చ చేశారు. ఇదంతా హాస్యాస్పదంగా అనిపించింది. ఆయనకంటే అద్భు మంచి నటుడు బాలీవుడ్‌లో చాలామందే ఉన్నారు. ఎన్నో హిట్లు అందుకున్నారు. అయిన వాళ్లకు తగిన గుర్తింపు లేదు. అవకాశాలు, అభినందనలు. అవార్డుల వాళ్ల వైపు కూడా రావు. ఎందుకంటే వాళ్లకు స్మార్ట్ పీఆర్ టీమ్, డబ్బులు లేవు’ అని ఎక్స్ వేదికగా రాసుకొచ్చాడు.
నెటిజన్ కామెంట్‌కు అభిషేక్ బచ్చన్ రియాక్ట్ అయ్యారు. ‘డియర్ నెటిజన్.. మీకు సూటిగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నాకు అవార్డులు కొనుక్కునే అలవాటు లేదు. ఇప్పటిదాకా అలాంటి పని చేయలేదు. నాకు పీఆర్ టీమ్‌లు లేవు. కష్టపడి పని చేయడం, రక్త, స్వేదం చిందించటం, కన్నీళ్లే నాకు తెలుసు. నేను చెప్పేది మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు. కానీ, మీ నోరు మూయించడానికి ఉత్తమమైన మార్గం ఏంటో నాకు తెలుసు. భవిష్యత్‌లో నేను ఏది సాధించినా అనుమానాలకు తావు లేకుండా కష్టపడి పనిచేస్తా.. నా విషయంలో మీ ఆలోచన తప్పని నిరూపిస్తాను. ఈ విషయాలన్నీ మీరు కామెంట్ చేశారని కాకుండా గౌరవవం, స్నేహభావంతో చెబుతున్నా’ అన్నారు.