Manchu Vishnu: కన్నప్ప హిట్ అయినా.. బాధలో విష్ణు

ABN , Publish Date - Jun 30 , 2025 | 04:41 PM

తాజాగా కన్నప్ప (Kannappa) సినిమా కూడా పైరసీ అయ్యిందని మంచు విష్ణు (Manchu Vishnu) వాపోయాడు.

Manchu Vishnu

Manchu Vishnu: ఇండస్ట్రీలో అన్ని మారుతున్నాయి కానీ, పైరసీని మాత్రం ఆపలేకపోతున్నాయి. ఎన్ని టెక్నాలజీలు వచ్చినా పైరసీ వలన ఇండస్ట్రీకి కలిగే నష్టాన్ని ఎవరూ పూడ్చలేకపోతున్నారు. కొత్త సినిమా రిలీజ్ అవ్వడం ఆలస్యం.. 24 గంటల్లో ఆ సినిమా పైరసీ సైట్స్ లో దర్శనమిస్తుంది. దీనివలన థియేటర్ లో చూడాల్సిన ప్రేక్షకుడు.. ఇంటిదగ్గర పైరసీ సైట్స్ లో చూస్తున్నారు. ఈ పైరసీ వలన నిర్మాతలు చాలా నష్టపోతున్నారు. తాజాగా కన్నప్ప (Kannappa) సినిమా కూడా పైరసీ అయ్యిందని మంచు విష్ణు (Manchu Vishnu) వాపోయాడు.


మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కన్నప్ప. మోహన్ బాబు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కన్నప్ప గత శుక్రవారం రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది. ప్రభాస్ క్యామియో సినిమాపై అత్యంత ఎక్కువ ప్రభావం చూపించింది. డార్లింగ్ కోసమే కన్నప్ప సినిమాకు వెళ్లేవారే ఎక్కువ అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. మంచు విష్ణు ఎన్నో ఏళ్ల తరువాత ఇలాంటి ఒక విజయాన్ని అందుకున్నాడు. అయితే ఆ ఆనందం మంచు విష్ణుకు ఎక్కువసేపు నిలువలేదు


కన్నప్ప పైరసీ అయ్యిందని మంచు విష్ణు వాపోయాడు. ఈ విషయం తెలిసి తన గుండె పగిలిందని చెప్పకొచ్చాడు. దాదాపు 30 వేల పైరసీ లింక్స్ లో కన్నప్ప సినిమా ఉందని చెప్పుకొచ్చాడు. 'ప్రియమైన సినిమా ప్రియులారా, కన్నప్పపై పైరసీ దాడి జరిగింది. ఇప్పటికే 30,000 కి పైగా అక్రమ లింక్‌లను తొలగించారు. ఇది తెలిసి నా గుండె పగిలింది. స్పష్టంగా, సింపుల్ చెప్పాలంటే పైరసీ అంటే దొంగతనం. మేము మా పిల్లలకు దొంగతనం నేర్పించము. పైరేటెడ్ కంటెంట్ చూడటం కూడా దొంగతనం చేసినట్టే.దయచేసి దానిని ప్రోత్సహించవద్దు. సినిమాను సరైన మార్గంలో చూడండి' అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.


Updated Date - Jun 30 , 2025 | 06:03 PM