Jwala Gutta: ఆమిర్ లేకుండా ఇది జరిగేది కాదు.. ఎంతో ప్రత్యేకం..
ABN, Publish Date - Jul 07 , 2025 | 04:53 PM
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, నటుడు విష్ణు విశాల్ లకుమార్తెకు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ నామకరణం చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల (Gutta Jwala), నటుడు విష్ణు విశాల్ (Vishnu Vishal) లకుమార్తెకు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ (Aamir khan) నామకరణం చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు విష్ణు విశాల్. ఆమిర్‌తో కలిసి దిగిన ఫొటో పంచుకున్నారు. చిన్నారి పేరు మిరా అని తెలిపారు. ‘‘మా బేబీకి పేరు పెట్టడానికి హైదరాబాద్ వచ్చిన ఆమిర్‌ఖాన్ సర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. మిరా అంటే శాంతి, షరతుల్లేని ప్రేమ. ఆమిర్ సర్‌తో ప్రయాణం అద్భుతం’’ అని విష్ణు పేర్కొన్నారు.
ఈ ఫొటోలు గుత్తా జ్వాల భావోద్వేగానికి లోనయ్యారు. ఆమిర్‌ఖాన్ రాకపోతే ఈ ఈవెంట్ ఇంత ఘనంగా జరిగేది కాదు అని గుత్తాజ్వాల పోస్ట్ చేశారు. ఈ పోస్టుపై పలువురు అభిమానులు స్పందించారు. చిన్నారి పేరు సూపర్‌గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఏప్రిల్ 22, 2021న విష్ణు విశాల్- గుత్తాజ్వాల వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 22న వీరికి పాప పుట్టడం విశేషం. ‘ఎఫ్‌ఐఆర్’, ‘లాల్ సలామ్’ తదితర డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమ్యారు విష్ణు.