Aamir–Hirani: ‘3 ఇడియట్స్’ సీక్వెల్
ABN, Publish Date - Dec 19 , 2025 | 01:51 PM
బాలీవుడ్ లో మరోసారి నోస్టాల్జియా అలజడి సృష్టించేందుకు రెడీ అవుతోంది. ఒక తరాన్ని ప్రభావితం చేసిన సినిమా కొనసాగింపుకు ప్లాన్ జరుగుతోంది. మరోసారి తెరపై ఆ అద్భుతం పునరావృతం అవుతుందా!?
‘3 ఇడియట్స్’ మూవీ వచ్చి 16 ఏళ్లు అవుతున్నా... ఆ సినిమా సృష్టించిన రికార్డ్స్ ఇప్పటికి చర్చనీయాంశమే. అప్పటికే కమర్షియల్ హిట్లతో జోరుమీదున్న బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ను కాలేజీ స్టూడెంట్ గా చూపించి వండర్స్ క్రియేట్ చేశాడు డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ. కామెడీ ట్రాక్ తో ప్రేక్షకులను నవ్విస్తూనే… చదువంటే ర్యాంకులే కాదు… జీవితాన్ని అర్థం చేసుకునే ప్రయాణం అన్న సున్నితమైన అంశాన్ని యువతకు బలంగా ఇంజెక్ట్ చేసిన సినిమా ఇది. అంతేకాక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాత్రమే కాదు.. సోషల్ డిస్కషన్స్ లో కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. తల్లిదండ్రులు, టీచర్లు, స్టూడెంట్స్ అందరూ మాట్లాడుకునేలా చేసిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతుందన్న న్యూస్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ, అమీర్ ఖాన్ మరోసారి జతకట్టబోతున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. కాలేజ్ డ్రామాగా వచ్చిన ‘3 ఇడియట్స్’ కు కొనసాగింపుగా వారు కొత్త కథను రెడీ చేస్తున్నారట. అమీర్ ఖాన్, ఆర్. మాధవన్, శర్మాన్ జోషి మరోసారి ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. 16 ఏళ్ల తర్వాత ఈ ముగ్గురి పాత్రలు ఎలాంటి కొత్త ప్రయాణాన్ని మొదలుపెడతాయన్నదే ఈ సీక్వెల్లో కీలకంగా ఉండబోతుందట. ఈ మూవీ హైప్ ను దృష్టిలో పెట్టుకుని రెండవ భాగానికి '4 ఇడియట్స్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. అంటే ఈసారి కథలోకి మరో కీలక పాత్ర ను ఎంటర్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. అమీర్ ఖాన్, మాధవన్, శర్మాన్ జోషి, కరీనా కపూర్ తో పాటు ఆ నాలుగో పాత్రలో ఎవరు నటిస్తారన్నదానిపై ఇప్పటికే వెతుకులాట మొదలైందట.
'దాదాసాహెబ్ ఫాల్కే' బయోపిక్ తీసే ఆలోచనను పక్కన పెట్టిన హిట్ మేకర్ రాజ్ కుమార్ హిరాణీ తన ఐకానిక్ బ్లాక్ బస్టర్ యూత్ ఫుల్ కామెడీ ‘3 ఇడియట్స్’ కు సీక్వెల్ తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. దాదాపు 200 కోట్లు వసూల్ చేసిన ఆ కల్ట్ క్లాసిక్ సీక్వెల్ ను ఇప్పటి జనరేషన్ కు కనెక్ట్ అయ్యేలా తీయాలనే ప్లాన్ లో హిరాణీ ఉన్నారట. ఈ సీక్వెల్ వార్త బయటకు రాగానే ఫ్యాన్స్ నుంచి మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. కొంతమంది ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తుంటే… మరికొందరు కల్ట్ సినిమాను టచ్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు... ఇంకొందరు ఇప్పటి జనరేషన్ సమస్యలను ఈ సీక్వెల్ ఎంతవరకు టచ్ చేస్తుందన్నదానిపై చర్చిస్తున్నారు. సీక్వెల్స్ విషయంలో హిరాణీకి ఉన్న ట్రాక్ రికార్డ్ ను దృష్టిలో పెట్టుకుంటే...ఈ ప్రాజెక్ట్ కూడా కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందన్న నమ్మకం ఫ్యాన్స్ లో కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Read Also: Allu Arjun: రోహిత్ శర్మతో.. అల్లు శిరీష్ యాడ్! అల్లు అర్జున్ రియాక్షన్ ఇదే!
Read Also: South Cinema: 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా'.. కవర్ పేజీలో సౌత్ ఆధిపత్యం