Vijay Deverakonda: ఖుషి సినిమా అక్కడ రికార్డు సృష్టించింది, ఎక్కడంటే...

ABN , Publish Date - Jan 08 , 2024 | 04:59 PM

2023లో సెకండ్ హయ్యెస్ట్ కలెక్టెడ్ నాన్ తమిళ్ మూవీగా విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన 'ఖుషి' సినిమా రికార్డ్

Vijay Deverakonda: ఖుషి సినిమా అక్కడ రికార్డు సృష్టించింది, ఎక్కడంటే...
A still from Khushi

తెలుగులో 'అర్జున్ రెడ్డి' సినిమాతో సెన్సేషనల్ నటుడుగా ప్రేక్షకుల అభిమానం పొందిన విజయ్ దేవరకొండ తమిళనాడులో కూడా తన క్రేజ్ చూపిస్తున్నారు. 'అర్జున్ రెడ్డి' హిట్ తరువాత విజయ్ సినిమాలు మిగతా భాషల్లో కూడా విడుదలవుతూ వస్తూ వున్నాయి. అలాగే ఒక్కో సినిమాతో అన్ని భాషలతో పాటు తమిళ ప్రేక్షకుల అభిమానాన్ని పొడటమే కాకుండా, వాళ్ళకి చాలా దగ్గరవుతున్నారు కూడా. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన 'ఖుషి' సినిమా తమిళనాడులో ఒక రికార్డు క్రియేట్ చేసింది అని చెప్పాలి.

khushi-team1.jpg

ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే, తమిళనాడులో తమిళ సినిమాలు కాకుండా వేరే భాషా సినిమాల్లో ఎక్కువ రెవిన్యూ కలెక్టు చేసిన రెండో సినిమాగా 'ఖుషి' రికార్డు నెలకొల్పింది అని చిత్ర నిర్వాహకులు అంటున్నారు. అందుకే విజయ్ అక్కడ ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యాడు అనటంలో సందేహం లేదు. ఈ 'ఖుషి' సినిమా లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే.

khushirecord.jpg

గతేడాది తమిళనాడులో 12 కోట్ల రూపాయలకు పైగా బాక్సాఫీస్ కలెక్షన్స్ దక్కించుకుంది. షారుఖ్, నయనతార, డైరెక్టర్ అట్లీ కాంబోలో వచ్చిన 'జవాన్' తర్వాత స్థానం 'ఖుషి'నే సంపాదించుకుంది. 'ఖుషి' తర్వాతి స్థానాల్లో 'సలార్', 'యానిమల్' సినిమాలున్నాయి. విజయ్ జోడీగా సమంత నటించిన 'ఖుషి' సినిమాను దర్శకుడు శివ నిర్వాణ రూపొందించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు.

Updated Date - Jan 08 , 2024 | 04:59 PM