Taapsee Pannu: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న తాప్సీ.. లీకైన పెళ్లి వీడియో వైరల్

ABN , Publish Date - Apr 04 , 2024 | 01:12 PM

రీసెంట్‌గా రకుల్ ప్రీత్ సింగ్, సోనారిక, మీరా చోప్రా వంటి హీరోయిన్ల పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వారి బాటలోనే మరో హీరోయిన్ తాప్సీ కూడా నడిచింది. తాప్సీ సీక్రెట్‌గా తన బాయ్‌ఫ్రెండ్ మథియాస్ బోని పెళ్లాడింది. తాప్సీ- మథియాస్‌ బోల పెళ్లి మార్చి 23న అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో సీక్రెట్‌గా జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు లీకై వైరలవుతోంది.

Taapsee Pannu: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న తాప్సీ.. లీకైన పెళ్లి వీడియో వైరల్
Taapsee and Mathias Boe

రీసెంట్‌గా రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh), సోనారిక (Sonarika), మీరా చోప్రా (Meera Chopra) వంటి హీరోయిన్లు పెళ్లి చేసుకుని.. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు వారి బాటలోనే మరో హీరోయిన్ తాప్సీ (Taapsee) కూడా నడిచింది. తాప్సీ సీక్రెట్‌గా తన బాయ్‌ఫ్రెండ్ మథియాస్ బో (Mathias Boe)ని పెళ్లాడింది. తాప్సీ- మథియాస్‌ బోల పెళ్లి మార్చి 23న అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో సీక్రెట్‌గా జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు లీకైంది. ఈ లీకైన వీడియో సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా.. నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘హ్యాపీ మ్యారీడ్ లైఫ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. (Taapsee and Mathias Boe Marriage Video Leaked)

*Celebrity Marriage: 'ఆదికేశవ' వైష్ణవ్ తేజ్ సిస్టర్ పెళ్లి, వరుడెవరంటే...

ఈ వీడియోలో తాప్సీ సంప్రదాయ దుస్తుల్లో, కూలింగ్ గ్లాస్ పెట్టుకుని సరదాగా డ్యాన్స్ చేసుకుంటూ పెళ్లి వేదికపైకి చేరుకోగా.. ఆమె బాయ్ ఫ్రెండ్ మథియాస్ బో (Mathias Boe) ఆమెకు హగ్‌తో స్వాగతం పలికారు. ఆ తర్వాత ఇద్దరూ దండలు మార్చుకొని ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. మథియాస్ బోతో తాప్సీకి ఎప్పటి నుండో పరిచయం ఉంది. వారి ప్రేమను కుటుంబ సభ్యులు వ్యతిరేకించినట్లుగా అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఇంట్లో అందరినీ ఒప్పించే.. తన ప్రియుడిని పెళ్లాడతానని తాప్సీ చెప్పినట్లే.. ఇప్పుడు అందరి సమక్షంలో తన వివాహాన్ని ముగించింది. (Taapsee and Mathias Boe Marriage Video)


Tapse.jpg

టాలీవుడ్‌లో చేసిన ‘ఝుమ్మంది నాదం’ (Jhummandi Naadam) చిత్రంలో తాప్సీ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. టాలీవుడ్‌లో ఆ తర్వాత చాలా సినిమాలు చేసినప్పటికీ సరైన హిట్ మాత్రం ఆమెకు పడలేదు. హిట్ సినిమా పడినా.. తనకు గుర్తింపును మాత్రం రాలేదు. అందుకే తాప్సీ దక్షిణాదిని వదిలి బాలీవుడ్‌‌కి వెళ్లిపోయింది. బాలీవుడ్‌లో ఆమె చేసిన ప్రతి సినిమా.. తాప్సీకి మంచి గుర్తింపును ఇవ్వడంతో.. ఇక అక్కడే సెటిలైంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు, మూడు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. పెళ్లి తర్వాత కూడా కొంతకాలం పాటు ఆమె నటించనుందని తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి:

====================

*Kona Venkat: తారక్ ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తా..

************************

*Paiyaa: 14 యేళ్ల తర్వాత ‘పయ్యా’ రీ రిలీజ్‌

*******************************

*Vijay Deverakonda: అలా చెప్పడం తప్పు కాదు.. అలా చెప్పి కొట్టకపోవడం తప్పు

******************************

Updated Date - Apr 04 , 2024 | 01:12 PM