గుర్రం స్వారీ చేస్తున్న సమంత, ఇది కూడా దానికోసమేనా...

ABN , Publish Date - Jan 29 , 2024 | 01:13 PM

సినిమాలు ఏమీ కొత్తవి ఒప్పుకోకపోయినా, చెయ్యకపోయినా సమంత వార్తల్లో వుంటూనే వున్నారు. తాజాగా ఆమె గుర్రం స్వారీ చేస్తున్న వీడియో ఒకటి పెట్టారు. ఇది కూడా ఆమెకి వచ్చిన వ్యాధి నయం అవటానికి చేస్తున్న ప్రక్రియలో భాగంగా చేస్తున్నారు అని అంటున్నారు.

గుర్రం స్వారీ చేస్తున్న సమంత, ఇది కూడా దానికోసమేనా...
Samantha horse riding

అగ్ర నటీమణుల్లో ఒకరైన సమంత ఎయిర్ పోర్టు నుండి వస్తున్నప్పుడో, వెళుతున్నప్పుడో ఫోటోలు సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. సమంత మయోసిటిస్ అనే వ్యాధితో బాధపడుతూ అందుకోసమని ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్న సంగతి కూడా తెలిసిందే. ఆమె చివరి సినిమా 'ఖుషి' విడుదలైంది, ఆ తరువాత ఆమె సినిమాలు ఏమీ కొత్తవి ఒప్పుకోలేదు, కానీ నిర్మాతగా కొన్ని సినిమాలు చేస్తాను అని చెప్పారు.

samanthahot.jpg

ఈమె చెయ్యాల్సిన సినిమా ఒకటి ఇప్పుడు శృతి హాసన్ చేస్తున్నారు. అంటే సమంత ఇప్పట్లో సినిమాలు చేసే పరిస్థితి కనిపించడం లేదు అని తెలుస్తోంది. అయితే ఇంతకీ సమంత మళ్ళీ వెండితెర మీద కనిపించదా, అనే సందేహం కూడా ఆమె అభిమానుల్లో చోటుచేసుకుంటోంది. ఎందుకంటే ఆమె చివరి సినిమా 'ఖుషి' గత సంవత్సరం సెప్టెంబర్ 1న విడుదలైంది. ఆ సినిమా విడుదలవ్వకముందే సమంత అమెరికా వెళ్లి అక్కడ విశ్రాంతి తీసుకుంది. మళ్ళీ ఇండియా వచ్చింది, ఇక్కడ సినిమాలు చెయ్యడం లేదు కానీ, చాల చురుకుగా సామజిక మాధ్యమాల్లోనూ, అలాగే కొన్ని షోస్ లో కనపడుతూ అభిమానులను అలరిస్తున్నారు.

samanthaglamourphoto.jpg

అలాగే తన ఇన్‌స్టాగ్రామ్ లో గుర్రం మీద స్వారీ చేస్తున్న వీడియో కూడా సమంత పోస్ట్ చేశారు. కేప్షన్ లో 'హీలింగ్' అనే పదం కూడా వాడారు, అంటే తనకి వచ్చిన వ్యాధికి గుర్రం స్వారీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది అని ఎవరైనా చెప్పి వుంటారు, అందుకే ఆమె గుర్రం స్వారీ చేస్తున్నారు అని అంటున్నారు. మామూలుగా నటీనటులు గుర్రం స్వారీ నేర్చుకుంటారు, అందులో భాగంగానే సమంత నేర్చుకున్నట్టు ఉంటుంది అనీ, అలాగే తన ఆరోగ్యానికి కూడా ఉపయోగం ఉంటుంది అని చేస్తున్నారు అని తెలిసింది. ఇదిలా ఉండగా ఆమె నటించిన 'సిటాడెల్' వెబ్ సిరీస్ ఇప్పుడు విడుదలకి సిద్ధంగా వుంది. ఆ వెబ్ సిరీస్ ప్రచారం కోసం సమంత మళ్ళీ మీడియా ముందుకు రావొచ్చు అని కూడా అంటున్నారు.

Updated Date - Jan 29 , 2024 | 01:13 PM