'పుష్ప ది రైజ్' చిత్రానికి ద‌క్కిన మ‌రో అరుదైన గౌర‌వం

ABN , Publish Date - Feb 17 , 2024 | 05:02 PM

బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ఇండియ‌న్ సినిమా 'పుష్ప ది రైజ్' ప్ర‌ద‌ర్శ‌న, కథానాయకుడు అల్లు అర్జున్ ఈ ప్రదర్శనకి హాజరయ్యారు

'పుష్ప ది రైజ్' చిత్రానికి ద‌క్కిన మ‌రో అరుదైన గౌర‌వం
Allun Arjun at the Berlin Film Festival

అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే బెర్లిన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్లో ఇండియ‌న్ సినిమా త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హించే అవ‌కాశం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ద‌క్కిన విష‌యం అంద‌రికి తెలిసిందే. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని ఆయ‌న ఇటీవ‌ల బెర్లిన్ 74వ ఇంట‌ర్నేష‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో పాల్గొనేందుకు జ‌ర్మ‌నీకి చేరుకున్నారు.

alluarjunberlin.jpg

ప్ర‌స్తుతం ఐకాన్‌స్టార్ బెర్లిన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లొ వున్నారు. కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప ది రైజ్' సంచలన విజయం సాధించింది. 2021 బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది పుష్ప. అల్లు అర్జున్ కెరీర్ లోనే అతిపెద్ద విజయంగా నిలవడంతోపాటు, తనకు జాతీయస్థాయి అవార్డు తెచ్చి పెట్టిన చిత్రంగా 'పుష్ప' నిలిచింది.

alluarjuninberlin.jpg

దీంతో దీనికి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న 'పుష్ప-2 ద రూల్' చిత్రం పై భారీ అంచనాలు పెరిగాయి. ఆగ‌స్టు 15న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే తాజాగా బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌గా పుష్ప ది రైజ్ చిత్రాన్ని స్పెష‌ల్ స్క్రీనింగ్ చేశారు నిర్వాహ‌కులు. దీంతో 'పుష్ప ది రైజ్‌'కు ద‌క్కిన అరుదైన గౌర‌వంతో ఐకాన్ స్టార్ అభిమానులు ఆనందంలో వున్నారు.


Pushpa-3.jpg

Pushpa-2.jpg

Pushpa.jpg

Bunny.jpg


ఇవి కూడా చదవండి:

====================

*Pushpa 2: విడుదల తేదీలో మార్పు లేదు, అనుకున్న తేదీకే వస్తోంది

*********************************

*Mahesh Babu: 'మురారి' సినిమా చూసి కృష్ణ ఏమన్నారో తెలిస్తే షాకవుతారు


Updated Date - Feb 17 , 2024 | 05:33 PM