నమ్రత పుట్టినరోజు, హాజరైన నగర సెలెబ్రెటీస్, ఫోటోస్ వైరల్

ABN , Publish Date - Jan 24 , 2024 | 01:56 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత తన పుట్టినరోజును మొన్న ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకకు మహేష్ కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు, నారా బ్రాహ్మిణి, అల్లు స్నేహ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ ఫోటోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి

నమ్రత పుట్టినరోజు, హాజరైన నగర సెలెబ్రెటీస్, ఫోటోస్ వైరల్
Namrata Shirodkar celebrated her birthday on Monday with her friends and family members

namratabirthdaysingle.jpg

namratabirthdaykids.jpg

namratabirthday.jpg

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ తన పుట్టినరోజుని హైదరాబాదులో ఎంతో సంబరంగా జరుపుకున్నారు. మహేష్ బాబు జర్మనీలో ప్రత్యేక శిక్షణ కోసం వెళ్లారు, బహుశా నమ్రత పుట్టినరోజుని మహేష్ ఇలా మిస్ అవటం ఇదే మొదటి సారి ఏమో.

namrathapinkyreddy.jpg

అయితే నమ్రత తన స్నేహితులు చాలామందిని పిలిచారు, అందరూ హాజరయ్యారు. అలాగే తన కుటుంబ సభ్యులు కూడా చాలామంది హాజరయ్యారు. ఈసారి పుట్టినరోజు ఎంతో సంబరంగా, ఒక మంచి జ్ఞాపకంగా చేసుకున్నారు నమ్రత.

namratabirthdayallusneha.jpg

మహేష్ బాబు సోదరీమణులు మంజుల, ప్రియదర్శిని, పద్మావతి తో పాటు రమేష్ బాబు భార్య కూడా నమ్రత పుట్టినరోజు సంబరాలకు హాజరైన వారిలో వున్నారు. ఇక తన పిల్లలు సితార, గౌతమ్ కూడా నమ్రత దగ్గరే వున్నారు.

namratabirthdayreddys.jpg

చాలామంది సెలెబ్రెటీలు హాజరయ్యారు. నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి వచ్చినవారిలో వున్నారు. అలాగే అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ రెడ్డి కూడా ఈ పుట్టినరోజుకి హాజరయ్యారు.

namratabirthdaycake.jpg

namratabirthdaynara.jpg

ఇక పింకీ రెడ్డి, దీప్తి రెడ్డి, మంజుల రెడ్డి ఇలా చాలామంది నమ్రత పుట్టినరోజుకి హాజరైన వారిలో వున్నారు. సినీ నటి కీర్తి సురేష్ కూడా హాజరైనట్టుగా తెలుస్తోంది. అలాగే నమ్రత స్నేహితులు చాలామంది వచ్చి ఈ వేడుకని మరింత సంబరంగా ఉండేట్టు చేశారు. ఇప్పుడు ఈ ఫోటోలు సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ వున్నాయి.

namratabirthdayfriendsand.jpg

namratabirthdaydirectorwife.jpg

Updated Date - Jan 24 , 2024 | 01:56 PM