మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mahesh Babu: రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు సంచలన నిర్ణయం

ABN, Publish Date - Feb 21 , 2024 | 05:20 PM

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చే సినిమా మీదే అందరి దృష్టి వుంది. ఇందులో మహేష్ లుక్ ఎలా ఉంటుంది, రాజమౌళి ఎలా చూపించబోతున్నారు అనే విషయాల మీద ఎక్కువ ఆసక్తి వుంది. ఈ సందర్భంగా మహేష్ ఒక నిర్ణయం తీసుకున్నారు, అదేంటంటే...

Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా సినిమా 'గుంటూరు కారం' సంక్రాంతికి థియేటర్స్ లో విడుదలై, తరువాత ఫిబ్రవరి 9 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతూ ఇంకా టాప్ టెన్ లో ట్రెండింగ్ అవుతోంది. మహేష్ బాబు ఇప్పుడు తన తదుపరి సినిమా అగ్ర దర్శకుడు రాజమౌళి తో చెయ్యడానికి సంసిద్ధం అవుతున్నారు. ఇందుకోసమని కొన్ని రోజుల క్రితం జర్మనీ వెళ్లి, శరీర దారుఢ్య శిక్షణ కూడా తీసుకున్నారు (Special fitness training). ఆసక్తికరం ఏంటంటే ఇంతవరకు ఎవరూ చూడని కొత్త లుక్ లో రాజమౌళి సినిమాలో మహేష్ బాబు కనిపించనున్నారని టాక్ వినపడుతోంది. (Mahesh Babu has taken a sensational decision for his upcoming film with Rajamouli)

ఇందుకోసమని మహేష్ బాబు ఇప్పుడు ఇంట్లో రోజూ వ్యాయామం చేస్తూ, రాజమౌళికి కావలసిన లుక్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారని తెలిసింది. జర్మనీ నుండి హైదరాబాదు తిరిగి వచ్చినప్పుడు విమానాశ్రయంలో మహేష్ బాబుని చూసిన చాలామంది అతని ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో పెట్టి కొత్త లుక్ బాగుందని చెప్పారు, ఆ ఫోటోలు వైరల్ కూడా అయ్యాయి. (Mahesh Babu's new look for Rajamouli film)

అయితే ఆ లుక్ కూడా కాదు, మహేష్ ని ఇంకా కొత్తగా చూపించాలని రాజమౌళి భావిస్తున్నట్టుగా వినికిడి. ఇందుకోసం రోజూ మహేష్, రాజమౌళి కలిసి మాట్లాడుకుంటున్నారని కూడా తెలిసింది. ఇక మహేష్ బయటకి రావటం కూడా తగ్గించేయాలని కూడా అనుకుంటున్నట్టుగా తెలిసింది. అందుకనే కొన్ని రోజుల క్రితం మహేష్ కుటుంబం హాజరవ్వాల్సిన వివాహానికి, మహేష్ భార్య నమ్రత మాత్రమే హాజరయ్యారు. (Mahesh Babu may not appear in public till his film with Rajamouli starts)

ఇక మహేష్ ని చూడటం చాలా కష్టం అని, అతను బయటకి రావటం కూడా ఉండకపోవచ్చు అని, ఎందుకంటే అతని కొత్త లుక్ సినిమా ప్రారంభం అయ్యేవరకు బయటకి చూపించకూడదు అని అటు రాజమౌళి, ఇటు మహేష్ భావిస్తున్నారని తెలిసింది. రాజమౌళి సినిమా మే నెలలో ప్రారంభం అవుతుందని తెలిసింది. ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో ఎక్కువ చిత్రీకరించనున్నట్టు తెలిసింది. ఇండియానా జోన్స్, జేమ్స్ బాండ్ తరహాలో మహేష్ బాబు పాత్ర ఉంటుందని రాజమౌళి ఇంతకుముందే చెప్పారు. (Mahesh Babu's new look for Rajamouli film)

ఇది కూడా చదవండి:

Guntur Kaaram: ఇది కదా మహేష్ బాబు స్టామినా అంటే!

SSMB29: రాజమౌళి, మహేష్ సినిమాకి టైటిల్స్ ఖరారు చేసారంట!

Updated Date - Feb 21 , 2024 | 05:25 PM