Bujji: మెగా ప్రిన్సెస్‌ క్లీంకారకు గిఫ్ట్‌గా ‘బుజ్జి’.. థ్యాంక్స్ చెప్పిన ఉపాసన

ABN , Publish Date - Jun 03 , 2024 | 04:07 PM

‘కల్కి 2898 AD’ టీమ్ ‘బుజ్జి’తో ఈ సినిమాను వార్తలలో నిలిపేలా చేస్తున్నారు. అదెలా అనుకుంటున్నారా? ‘బుజ్జి’ టాయ్స్‌ని సెలబ్రిటీ పిల్లలకు గిఫ్ట్‌లుగా పంపి.. ఈ సినిమాను వార్తలలో హైలెట్ అయ్యేలా టీమ్ చేస్తోంది. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా ముందు ఈ టాయ్ సెట్ క్లీంకారను చేరింది. క్లీంకారకు వచ్చిన గిఫ్ట్ బాక్స్‌లో బుజ్జి - భైరవ స్టికర్స్‌, బుజ్జి బొమ్మ, టీషర్ట్స్‌ ఉండగా.. క్లీంకార వాటితో ఆడుకుంటున్న ఫొటోని ఉపాసన తన ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.

Bujji: మెగా ప్రిన్సెస్‌ క్లీంకారకు గిఫ్ట్‌గా ‘బుజ్జి’.. థ్యాంక్స్ చెప్పిన ఉపాసన
Kalki 2898 AD team Sends Gift to Klinkaara

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యూచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మాగ్నమ్ ఓపస్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD). జూన్ 27న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోన్న ఈ చిత్ర ప్రమోషన్స్‌ని మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇందులో ‘బుజ్జి’ (Bujji)ని ప్రజంట్ చేసిన తీరు.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేసింది. ఇప్పుడదే ‘బుజ్జి’తో ఈ సినిమాను వార్తలలో నిలిపేలా చేస్తున్నారు మేకర్స్. అదెలా అనుకుంటున్నారా? ‘బుజ్జి’ టాయ్స్‌ని సెలబ్రిటీ పిల్లలకు గిఫ్ట్‌లుగా పంపి.. ఈ సినిమాను వార్తలలో హైలెట్ అయ్యేలా టీమ్ చేస్తోంది. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా ముందు ఈ టాయ్ సెట్ క్లీంకారను చేరింది.

Also Read- Anjali: బాలయ్య నన్ను ఎందుకు నెట్టారో నాకు తెలుసు.. అనవసరంగా పెద్దది చేశారు


రామ్‌ చరణ్‌, ఉపాసన దంపతుల కుమార్తె, మెగా ప్రిన్సెస్ క్లీంకార (Mega Princess Klin Kaara)కు ‘కల్కి 2898 AD’ యూనిట్‌ ‘బుజ్జి’ని గిప్ట్‌గా పంపించింది. క్లీంకారకు వచ్చిన గిఫ్ట్ బాక్స్‌లో బుజ్జి - భైరవ స్టికర్స్‌, బుజ్జి బొమ్మ, టీషర్ట్స్‌ ఉండగా.. క్లీంకార వాటితో ఆడుకుంటున్న ఫొటోని ఉపాసన (Upasana) తన ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ‘థ్యాంక్యూ అండ్ ఆల్ ది బెస్ట్’ అంటూ ఉపాసన షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అంతేకాదు, ‘కల్కి 2898 AD’ మూవీ టీమ్ ఈ విషయంలో చాలా కొత్తగా ఆలోచించిందనేలా కూడా కామెంట్స్ పడుతుండటం విశేషం.


Upasana.jpg

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్ వంటి ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్స్‌తో సహా దీపికా పదుకొణె, దిశా పటాని వంటి ప్రముఖ తారాగణంతో రూపొందుతోన్న ఈ ‘కల్కి 2898 AD’ చిత్రం ఇప్పటికే ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘సలార్’ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న ఈ సినిమాపై ఆయన అభిమానులు కూడా ఎన్నో అంచనాలను పెట్టుకుని ఉన్నారు. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందో, లేదో తెలియాలంటే జూన్ 27 వరకు వెయిట్ చేయాల్సిందే. (Kalki 2898 AD Promotions)

Read Latest Cinema News

Updated Date - Jun 03 , 2024 | 04:14 PM