Kalki 2898 AD : కల్కి టీంకు బహుమతులు

ABN , Publish Date - May 27 , 2024 | 01:17 AM

ఇటీవలే బుజ్జి (కారు)ని పరిచయం చేసి ‘కల్కి 2898 ఏడి’ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచారు ప్రభాస్‌. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు వస్తోంది...

Kalki 2898 AD : కల్కి టీంకు బహుమతులు

ఇటీవలే బుజ్జి (కారు)ని పరిచయం చేసి ‘కల్కి 2898 ఏడి’ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచారు ప్రభాస్‌. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే కొన్ని పెండింగ్‌ సీన్స్‌కు సంబంధించిన ప్యాచ్‌వర్క్‌ను ఇటీవలే పూర్తి చేసి, షూటింగ్‌ ముగించారని తెలుస్తోంది. ఈ సందర్భంగా సినిమాకు పనిచేసిన టీంకు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ‘కల్కి’ బ్యాడ్జ్‌, అభినందన లేఖ, టీషర్ట్‌, శ్రీకృష్ణుడి చిత్రం ఉన్న వెండి ప్రతిమ, కాయిన్‌, గొలుసును బహూకరించారట. చిత్రబృందంలోని కొందరు ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వైరల్‌ అవుతున్నాయి. దీపికా పదుకొణే, కమల్‌హాసన్‌, అమితాబ్‌బచ్చన్‌ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సి. అశ్వనీదత్‌ నిర్మాత.


వారు నవ్వకుండా ఉండలేరు

ప్రభాస్‌, ప్రశాంత్‌నీల్‌ మధ్య సృజనాత్మక విభేదాల వల్ల ‘సలార్‌ 2’ చిత్రాన్ని పక్కనపెట్టినట్లు వస్తున్న వార్తలపై నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ సోషల్‌ మీడియాలో పరోక్షంగా స్పందించింది. షూటింగ్‌లో ప్రశాంత్‌నీల్‌, ప్రభాస్‌ మనసారా నవ్వుతున్న ఫొటోను షేర్‌ చేస్తూ, ‘వారు నవ్వకుండా ఉండలేరు’ అని కామెంట్‌ పెట్టింది. దీంతో త్వరలోనే సలార్‌ 2 సెట్స్‌పైకి వెళ్లడం ఖాయంగా భావిస్తున్నారు.

Updated Date - May 27 , 2024 | 01:18 AM