40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ayodhya Ram Mandir Pran Pratishta: రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠకు ఎవరెవరు వెళ్లారంటే..!

ABN, Publish Date - Jan 22 , 2024 | 12:00 PM

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి దేశవ్యాప్తంగా సినీస్టార్‌లకు ఆహ్వానాలు అందాయి. ఇప్పటికే దేశంలో పలు చిత్ర పరిశ్రమల నుంచి సినిమా సెలబ్రిటీలు ప్రత్యేక విమానాల్లో అయోధ్యకు చేరుకున్నారు. కొందరు ఆదివారమే అయోధ్యకు చేరుకోగా, మరికొందరు సోమవారం ఉదయం అయోధ్యలో అడుగుపెట్టారు

Ayodhya Ram Mandir Pran Pratishta: రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠకు ఎవరెవరు వెళ్లారంటే..!

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి దేశవ్యాప్తంగా సినీస్టార్‌లకు ఆహ్వానాలు అందాయి. ఇప్పటికే దేశంలో పలు చిత్ర పరిశ్రమల నుంచి సినిమా సెలబ్రిటీలు ప్రత్యేక విమానాల్లో అయోధ్యకు చేరుకున్నారు. కొందరు ఆదివారమే అయోధ్యకు చేరుకోగా, మరికొందరు సోమవారం ఉదయం అయోధ్యలో అడుగుపెట్టారు. ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సినీ ప్రముఖులకు  శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్‌ ప్రతినిధులు సాదరంగా స్వాగతం పలికారు. మరికొద్ది సేపట్లో జరగబోయే రామ్‌ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొనడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారు సెలబ్రిటీలు. 

celebs.jpg

ఇప్పటికే టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, సురేఖ, రామ్‌చరణ్‌, జనసేనాని పవనకల్యాణ్‌, నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌, బాలీవుడ్‌ నుంచి అమితాబ్‌ బచ్చన, అనుపమ్‌ ఖేర్‌, విక్కీ కౌశల్‌, కట్రీనా కైఫ్‌, జాకీ ష్రాఫ్‌, రాజ్‌కుమార్‌ హిరాణీ, రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియాభట్‌, రోహితశెట్టి, మాధురీ దీక్షిత సాంప్రదాయ దుస్తులు ధరించి ఈ వేడుకలో పాల్గొన్నారు. కోలీవుడ్‌ నుంచి రజినీకాంత హాజరయ్యారు. కంగనా రనౌత ఆదివారం అయోధ్య చేరుకుని హనుమాన్  హోమం చేయించిన సంగతి తెలిసిందే! 


Updated Date - Jan 22 , 2024 | 12:37 PM