Jaiyetri Makana: యూ ట్యూబ్ జైత్రీ.. ఇది నువ్వేనా! న‌మ్మ‌లేక‌పోతున్నాం

ABN , Publish Date - Apr 01 , 2024 | 05:31 PM

జైత్రీ.. ఈ పేరు తెలియని యూ ట్యూబ్‌ వీక్షకులు ఉండరు. యూ ట్యూబ్‌లో గ‌ర్ల్ నెక్ట్స్ డోర్ అన్న రీతిలో వీడియోలతో ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కు బాగా ద‌గ్గ‌రైన‌ ఈ అమ్మడు వాస్త‌వంలో మాత్రం అందుకు పూర్తి విరుద్దం.

Jaiyetri Makana: యూ ట్యూబ్ జైత్రీ.. ఇది నువ్వేనా! న‌మ్మ‌లేక‌పోతున్నాం
Jaiyetri Makana

జైత్రీ (Jaiyetri Makana).. ఈ పేరు తెలియని యూ ట్యూబ్‌ వీక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అతి త‌క్కువ కాలంలో ఎక్కువ ప్రాచుర్యం పొందిన తెలుగు అమ్మాయిలో ఒక‌రిగా పేరు తుచ్చుకుంది. నిత్యం స‌మాజంలో మ‌న‌కు ఎదురుప‌డే.. మ‌నం త‌రుచూ చూసే యువ‌తిలా ఉంటుంది.

9.jpg

అచ్చం మన పక్కింటి అమ్మాయిలా ఉంటూ.. రోజువారీగా మన ఇండ్లలో జరిగే విష‌యాల‌ను నేటి తరానికి నచ్చేలా ఆస‌క్తిగా మ‌ల‌చడంలో దిట్ట. అందుకే యూట్యూబ్‌లో బాగా ఫేమ‌స్ అయిన‌ వైరల్లీ ఓరిజినల్స్ ఛాన‌ల్‌లో వచ్చే ఈ అమ్మడు వీడియోలు స‌ర్రున దూసుకుపోతుంటాయి.

jj.jpg

క‌రోనా స‌మ‌యంలో.. యూ ట్యూబ్ వీడియోల‌తో ఉన్న‌ఫ‌లంగా వెలుగులోకి వ‌చ్చిన‌ జైత్రీ (Jaiyetri Makana) మంచి ఫేమ్‌, నేమ్ సంపాదించుకుంది. అదే వ‌రుస‌లో ససినిమా ఛాన్సులు కూడా ద‌క్కించుకుంది. ఆ మ‌ధ్య వ‌చ్చిన‌ తుపాకుల గూడెం సినిమాలో హీరోయిన్‌గా కూడా నటించింది.

8.jpg

హ‌స్ట‌ల్ డేస్, పెళ్లికూత‌రు పార్టీ అనే సినిమాల్లోనూ కీ రోల్స్‌ చేసింది. యూ ట్యూబ్‌లో గ‌ర్ల్ నెక్ట్స్ డోర్ అన్న రీతిలో వీడియోలతో రెండు తెలుగు రాష్టాల ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కు బాగా ద‌గ్గ‌రైన‌ ఈ అమ్మడు వాస్త‌వంలో మాత్రం అందుకు పూర్తి విరుద్దం.

J11.jpg

అయితే.. ఖాళీ స‌మ‌యం దొరికితే చాలు గోవా, బ్యాంకాంక్‌, బాలి అంటూ విహార‌యాత్ర‌ల‌కు వెళ్లిపోయే జైత్రీ (Jaiyetri Makana) యూ ట్యూబ్‌లో వ్లాగ్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఎక్కువ స‌ముద్ర తీర ప్రాంతాల‌కు వెళ్లే ఈ చిన్న‌ది అక్క‌డ స్విమ్మింగ్‌ పూల్స్‌, బీచ్‌లలో ఎంజాయ్‌ చేస్తూ తన డ్రెస్సింగ్‌తో హట్‌నెస్‌ పెంచుతూ ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ కుర్ర‌కారు మ‌తులు పొగొడుతున్నది.

FSp_598WIAAxeBe.jpeg


అంతేగాక ఫ్రెండ్స్ స‌ర్కిల్‌లో జ‌రిగే పార్టీల‌కు త‌న‌దైన స్టైల్‌లో దుస్తులు ధ‌రించి హ‌జ‌ర‌వుతూ మెస్మ‌రౌజ్ చేస్తూ ఉంటుంది. ఈ మ‌ధ్య జువెల‌రీ, బ్యూటీ కేర్, కాస్మోటిక్స్ వంటి కొన్ని బ్రాండ్‌ల‌కు కూడా ప్ర‌మోష‌న్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది.

J5.jpg

యూ ట్యూబ్‌ వీడియోలలో చాలా ప‌ద్ధ‌తిగా దుస్తులు వేసుకునే జైత్రీ (Jaiyetri Makana).. ప‌ర్యాట‌క ప్రాంతాల్లో మాత్రం అన‌సూయ‌, త‌మ‌న్నాల‌ను మించి స్టైల్ మెయింటెన్ చేస్తుంది.

J1.jpg

ఈ వీడియోలు, ఫొటోలు చూసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. మేం చూసేది అసలు జైత్రీ (Jaiyetri Makana)నేనా, ఇలాంటి డ్రెస్సులు కూడా వేస్తుందా అనుకుంటూ నోరెళ్ల బెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ చూసేయండి మరి.

Updated Date - Apr 01 , 2024 | 05:31 PM