మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chiranjeevi: నా జీవన రేఖ.. భార్య సురేఖకు చిరు బర్త్‌డే విశెస్

ABN, Publish Date - Feb 18 , 2024 | 11:27 AM

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా భార్య సురేఖకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘‘నా జీవన రేఖ, నా సౌభాగ్య రేఖ, నా భాగస్వామి సురేఖ! నా లైఫ్‌లైన్‌కి మరియు నా సక్సెస్‌కి ముఖ్య కారణమైన సురేఖకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి సంతోషకరమైన పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని భార్య సురేఖకు చిరంజీవి ట్విట్టర్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.

Chiranjeevi and Surekha

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సోషల్ మీడియా వేదికగా భార్య సురేఖ (Surekha)కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘‘నా జీవన రేఖ, నా సౌభాగ్య రేఖ, నా భాగస్వామి సురేఖ! నా లైఫ్‌లైన్‌కి మరియు నా సక్సెస్‌కి ముఖ్య కారణమైన సురేఖకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి సంతోషకరమైన పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని భార్య సురేఖకు చిరంజీవి ట్విట్టర్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.

పుట్టినరోజు అనే కాదు.. మెగాస్టార్ చిరంజీవి తన భార్య గురించి ఎప్పుడూ చెప్పే మాట ఇదే. తన సక్సెస్‌కి తన భార్య ఒక గ్రేటెస్ట్ పిల్లర్ అని. తను షూటింగ్స్‌కి వెళితే.. అంత పెద్ద ఫ్యామిలీని ఆమె ఎంతో చక్కగా నడిపే వారని, తన తమ్ముళ్లని కూడా సొంత కొడుకులుగా భావించేవారని, ఎవరికీ ఏ లోటు రానియ్యకుండా చాలా గొప్పగా మానేజ్ చేసేవారిని.. ఎన్నో సందర్భాలలో సురేఖ గురించి చిరంజీవి చెప్పారు. ఇదే విషయాన్ని మరోసారి ఆమె పుట్టినరోజు సందర్భంగా చిరు తెలియజేశారు. (Chiranjeevi Birthday wishes to His Wife Surekha)


ప్రస్తుతం చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి విహార యాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కూడా ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ విహార యాత్ర‌లో భాగంగా తన క్లోజ్ ఫ్రెండ్ NRI అయిన‌ కుమార్ కోనేరు కుమారుడు కిరణ్ కోనేరు, శైల్య శ్రీల వివాహ వేడుకలో సైతం చిరు దంపతులు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. ఆ ఫొటోలను కూడా మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఈ వేడుకలో చిరంజీవి, సురేఖ దంప‌తుల‌తో పాటు విక్టరీ వెంకటేశ్ ఆయన సతీమణి కూడా పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Gaami: ఆసక్తికరంగా ‘గామి’ క్యారెక్టర్స్ టీజర్.. విశ్వక్ సేన్‌‌కే సమస్య!

******************************

*Aa Okkati Adakku: తండ్రి సినిమా టైటిల్‌కు ఫిక్సయిన అల్లరి నరేష్.. గ్లింప్స్ అదిరింది

**************************

*Vijay Deverakonda: ఫోర్బ్స్‌ లిస్ట్‌లో రష్మికకు చోటు.. విజయ్ స్పందనిదే..

****************************

Updated Date - Feb 18 , 2024 | 11:27 AM