40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Anupama Parameswaran: అనుపమ ఏంటి అలా అనేసింది, గ్లామర్ ఫోటోస్ వైరల్

ABN, Publish Date - Jan 24 , 2024 | 03:36 PM

అనుపమ పరమేశ్వరన్ సినిమాలు గత సంవత్సరం ఒక్కటి కూడా విడుదల కాలేదు. రానున్న రోజుల్లో రెండు సినిమాలు విడుదలకి వున్నాయి. కానీ అనుపమ తన సామజిక మాధ్యమాల్లో మాత్రం చురుకుగా ఉంటూ తన తాజా ఫోటోలు పెడుతూ ఉంటుంది. ఈసారి కూడా కొన్ని గ్లామర్ ఫోటోలను పోస్ట్ చేసింది. అవి వైరల్ అవుతున్నాయి.

Anupama Parameswaran posted her latest photos on her social media

మలయాళ నటి అనుపమ పరమేశ్వరన్ తెలుగులో 'అ. ఆ.. ' అనే సినిమా ద్వారా పరిచయం అయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి దర్శకుడు. 'రావణాసురిడి వాళ్ళవిడ కూడా వాళ్ళాయనని పవన్ కళ్యాణ్ అనే అనుకుంటుంది' అనే ఈ డైలాగ్ అప్పట్లో చాలా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో అనుపమ తెలుగులో తన డైలాగ్స్ తనే చెప్పుకోవటమే కాకుండా, నటనలో కూడా మంచి ప్రతిభ కనపరచింది.

ఆ తరువాత అనుపమ చాలా తెలుగు సినిమాలు చేసింది, మంచి నటి అని అనిపించుకుంది. ఏ పాత్రలో అయినా ఇమిడిపోయి ఆ పాత్రకి తాను న్యాయం చేస్తుంది. మొదట్లో కొంచెం సంప్రదాయమైన పాత్రలకు మాత్రమే అనుపమ చేస్తుంది అని అనిపించుకున్నా, 'రౌడీ బాయ్స్' సినిమాలో ఆశిష్ రెడ్డి పక్కన చేసిన అనుపమ ఆ సినిమాలో కొన్ని ముద్దు సన్నివేశాల్లో నటించి, తాను గ్లామర్ పాత్రలు కూడా చేస్తాను అనే సంకేతాన్ని ఇచ్చింది.

అనుపమ సినిమాలు ఏవీ కూడా గత సంవత్సరం విడుదల కాలేదు. అంతకు ముందు నిఖిల్ తో చేసిన 'కార్తికేయ 2' సినిమా పెద్ద విజయం సాధించింది, ఆ తరువాత వచ్చిన '18 పేజెస్' సినిమా కూడా బాగుంది. 'బట్టర్ ఫ్లై' అనే సినిమా మాత్రం సరిగ్గా నడవలేదు. 'కార్తికేయ' లాంటి సినిమాతో మంచి బ్రేక్ వచ్చినా, అనుపమకు ఇంకా పెద్ద సినిమా ఛాన్సులు మాత్రం రావటం లేదు.

ఈ ఫిబ్రవరి నెలలో ఆమె నటించిన 'ఈగల్' సినిమా విడుదలవుతోంది. రవి తేజ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ఒక యాక్షన్ నేపథ్యంలో ఉంటుంది అని అంటున్నారు. ఈ సినిమాలో అనుపమ ఒక ముఖ్యపాత్ర పోషించింది.

ఇంకో సినిమా 'టిల్లు స్క్వేర్'. సిద్ధూ జొన్నలగడ్డ ఇందులో కథానాయకుడు. ఈ సినిమా కూడా విడుదలకి సిద్ధం అవుతోంది. ఈ సినిమా 'డీజే టిల్లు' కి సీక్వెల్ గా వస్తోంది. మొదటి సినిమాలో కొంచెం అడల్ట్ జోక్స్ వున్నాయి, ఈ సినిమాలో కూడా వుంటాయని అనుకుంటున్నారు.

'టిల్లు స్క్వేర్' నుండి ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలు, పాటలు విడుదలయ్యాయి. అందులో అనుపమ చాలా గ్లామరస్ గా కనిపిస్తోంది. ఇంతకు ముందు అంటే అనుపమ కెరీర్ మొదట్లో చేసిన సినిమాలతో పోలిస్తే, ఇప్పుడు ఈ 'టిల్లు స్క్వేర్' లో ఒక కొత్త అనుపమని చూడొచ్చు అని అనుకుంటున్నారు. ఈమెకి సామజిక మాధ్యమాల్లో చాలామంది ఫాలోవర్స్, అభిమానులు వున్నారు. ఒక్కోసారి అనుపమ పెట్టె ఫోటోలను చూసి చాలామంది అభిమానులు తాము ఎంతగా హర్ట్ అయిందీ కూడా కామెంట్స్ లో పెడుతూ వుంటారు. ఈసారి అనుపమ కొన్ని గ్లామరస్ ఫోటోస్ ని పెట్టింది, అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. "Somethin’ ‘bout you Makes me feel like a dangerous woman!" అని కేప్షన్ ఇచ్చింది. ఎందుకు డేంజర్ పిల్ల అయిందో మరి!

Updated Date - Jan 24 , 2024 | 03:52 PM