పెళ్లికూతురైన అనుపమ పరమేశ్వరన్, ఫోటోస్ వైరల్

ABN , Publish Date - Feb 08 , 2024 | 06:24 PM

అనుపమ పరమేశ్వరన్ పెళ్లికూతురు గెటప్ లో వున్న ఫోటోలు తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతూ వున్నాయి. ఇంతకీ ఆమె పెళ్లికూతురైంది సినిమా కోసమా, లేక...

పెళ్లికూతురైన అనుపమ పరమేశ్వరన్, ఫోటోస్ వైరల్
Anuapama Parameswaran

దక్షిణాది భాషల సినిమాలన్నిటిలోనూ నటించి మంచి పేరు తెచ్చుకున్న నటీమణుల్లో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. 2022లో 'కార్తికేయ 2' సినిమాతో మంచి విజయం తన ఖాతాలో వేసుకున్న అనుపమ, గత సంవత్సరం ఒక్క సినిమా కూడా విడుదలవ్వలేదు. ఆమె నటిస్తున్న 'ఈగల్' సినిమా రేపు శుక్రవారం విడుదలవుతోంది. ఇందులో రవి తేజ కథానాయకుడు, కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. ఈసినిమా ఒక యాక్షన్ నేపధ్యంగా సాగే కథ అని ప్రచార వీడియోలు చూస్తే అర్థం అవుతోంది.

anupamaparameswaranbride.jpg

అయితే ఇందులో అనుపమ పాత్ర ఎలా వుండబోతోంది అనేది రవితేజ చూచాయగా చెప్పారు. ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకం, ఒక ముఖ్యమైన పాత్రలో అనుపమ కనిపిస్తుందని చెప్పారు. ఈ సినిమా ప్రచారాల్లో భాగంగా ఒకసారి అనుపమ, ఈ చిత్ర దర్శకుడు కార్తీక్ ని 'కార్తీక్ అన్నయ్యా' అని అంది. వెంటనే రవితేజ అందమైన అమ్మాయిలు ఆలా 'అన్నయ్యా' అని పిలిస్తే బాగోదు అని సరదాగా అన్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకల్లో అనుపమ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనికి రాకీ కట్టి తనకి కార్తిక్ అన్నయ్యేనని చెప్పింది. ఈ సినిమా అనుపమ కెరీర్ లో ఒక కీలకమైన సినిమా అని చెప్పొచ్చు.

anupamaparameswaranpelli.jpg

అలాగే అనుపమ 'సైరెన్' అనే తమిళ సినిమా కూడా చేస్తోంది. ఈ సినిమాలోంచి ఈమధ్యనే ఒక పాట కూడా విడుదలైంది. ఇందులో జయం రవి కథానాయకుడు కాగా ఆంథోనీ భాగ్యరాజ్ దర్శకుడు. కీర్తి సురేష్ కూడా ఇంకో కథానాయకురాలిగా ఈ సినిమాలో కనపడనుంది. ఈ సినిమా నుండి ఆమె పెళ్లికూతురు పాత్రలో కనిపిస్తున్న చిత్రాలను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

anupamaparameswaran.jpg

ఈ సినిమా నుంచి విడుదలైన పాటలో అనుపమ పెళ్లికూతురిగా కనపడింది. ఇందులో ఆమె జయం రవిని వివాహం చేసుకుంటున్నట్టుగా చూపించారు. అయితే 'సైరెన్' ఈ నెలలోనే విడుదలవుతోంది అని తెలుస్తోంది. రేపు తెలుగు సినిమా విడుదలైతే, వచ్చే వారం ఈ తమిళ సినిమా విడుదలకి సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తోంది.

ఈ రెండు సినిమాలే కాకుండా ఇంకో తెలుగులో 'టిల్లు స్క్వేర్' అనే సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ పక్కన కూడా నటిస్తోంది. ఈ సినిమా మార్చిలో విడుదలవుతోంది. ఇందులో అనుపమ చాలా గ్లామర్ గా కనపడబోతోంది అని ఆ సినిమా ప్రచార వీడియోలు చూస్తే అర్థం అవుతోంది.

Updated Date - Feb 08 , 2024 | 06:24 PM