Anasuya: ఓ షో లో డ్రస్ విప్పేస్తోన్న అనసూయ.. అంత ఆగలేకపోతున్నారా? అంటూ నెటిజన్‌కు రిప్లయ్!

ABN , Publish Date - Jun 23 , 2024 | 07:57 PM

గ్లామర్‌తో పాటు గొడవలతోనూ ఎప్పుడూ వార్తలలో ఉండే నటి అనసూయ భరద్వాజ్. సోషల్ మీడియాలో గ్యాప్ ఇవ్వకుండా వరసగా గ్లామర్ ఫొటోలు షేర్ చేసే అనసూయ.. ఆ ఫొటోలపై కానీ, లేదా తనని టార్గెట్ చేస్తూ ఏవైనా పోస్ట్‌లు పెట్టే వారిపై అంతే స్థాయిలో కౌంటర్స్ వేస్తుంటుంది. ఇప్పుడలాంటి కౌంటరే అనసూయ ఓ నెటిజన్‌పై వేసింది. దీంతో ప్రస్తుతం ఆమె పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Anasuya: ఓ షో లో డ్రస్ విప్పేస్తోన్న అనసూయ.. అంత ఆగలేకపోతున్నారా? అంటూ నెటిజన్‌కు రిప్లయ్!
Actress Anasuya Bharadwaj

గ్లామర్‌తో పాటు గొడవలతోనూ ఎప్పుడూ వార్తలలో ఉండే నటి అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj). సోషల్ మీడియాలో గ్యాప్ ఇవ్వకుండా వరసగా గ్లామర్ ఫొటోలు షేర్ చేసే అనసూయ.. ఆ ఫొటోలపై కానీ, లేదా తనని టార్గెట్ చేస్తూ ఏవైనా పోస్ట్‌లు పెట్టే వారిపై కానీ అంతే స్థాయిలో కౌంటర్స్ వేస్తుంటుంది. ఇప్పుడలాంటి కౌంటరే అనసూయ ఓ నెటిజన్‌పై వేసింది. దీంతో ప్రస్తుతం ఆమె పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు విషయం ఏమిటంటే..

Anasuya-Beauty.jpg

రీసెంట్‌గా అనసూయ ఓ టీవీ షో లో పాల్గొంది. అనసూయ పాల్గొన్న ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోని తాజాగా ఆ టీవీ షో వారు వదిలారు. ఈ ప్రోమోలో కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌తో పోటీ పడుతూ.. అనసూయ కూడా తన ఒంటిపై ఉన్న దుస్తులను ఒక్కొక్కటిగా విప్పేస్తుంది. అయితే అనసూయ విప్పింది కేవలం తన ఒంటిపై ఉన్న జాకెట్ మాత్రమే. ఆ తర్వాత ఏం జరిగిందనేది? తెలియకుండా ప్రోమోని కట్ చేశారు. ఈ ప్రోమోని పోస్ట్ చేసిన ఓ నెటిజన్ ‘‘ఏంటీ ఛండాలం అనసూయ.. ఏమైనా అంటే విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తారు?’’ అంటూ వాంతి చేసుకుంటున్న ఎమోజీలను షేర్ చేశాడు. ఈ పోస్ట్‌కు రిప్లయ్ ఇస్తూ.. ‘‘ఎక్స్‌క్యూజ్‌మీ.. మీరు ఎందుకింత అనారోగ్యంగా ఉన్నారో తెలుసుకోవచ్చా? అంటే మీ ఎమోజీల మాదిరిగానే మీ మైండ్ కూడా ఉందనిపిస్తుంది’’ అంటూ అనసూయ కౌంటరిచ్చింది. (Anasuya Counter)


anasuya.jpg

అనసూయ ఇచ్చిన ఈ కౌంటర్‌కు మరో నెటిజన్ రియాక్ట్ అవుతూ.. ‘‘నీకు నిజంగా అర్థం కావట్లేదా అండీ.. ఎలా ఉండే షో ఎలా అవుతున్నాయి. అందులో మీ పాత్ర మంచిగా ఉండాలి కానీ.. చాలా బ్యాడ్‌గా వెళుతుందండి. నటిగా మిమ్మల్ని మేము ఆరాధిస్తాం కానీ.. ఇలాంటి కార్యక్రమాలలో అలాంటివి చేయకుండా ఉండటమే మంచిదండి’’ అని అనసూయకు సూచన చేశాడు.

దీనికి కూడా అనసూయ సమాధానం ఇచ్చింది. ‘‘ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీకి చెందిన వారెవరైనా.. ప్రేక్షకుల అభిరుచి మేరకు, అలాగే కాలానికి అనుగుణంగా కొన్ని విషయాలను విశ్లేషిస్తుంటాం. అయినా మీ ప్రతాపం అంతా బుల్లితెరకే పరిమితమా అండీ? పెద్దతెర (వెండితెర) మీద ఎన్నో అభ్యంతరకరమైనవి వస్తున్నా మీరు బ్లాక్‌బస్టర్స్ చేస్తారు.. అలాగే షో అంతా చూసే వరకు కూడా ఆగడం ఉండదు మీ జడ్జిమెంట్స్. అది కేవలం ప్రోమో మాత్రమే. మేము చేసేదానికి ముందు, వెనుక ఓ కథ ఉంటుంది. అయినా అందులో (ప్రోమోలో) అంత ఇబ్బందికరంగా ఏముందో అది వారి వారి లిమిట్స్‌కి పరిమితం కదండీ.. కొందరికీ ఫ్యాంట్, షర్ట్ కూడా చాలా ఇబ్బందే.. నేను చెబుతున్నది మీకు అర్థమై ఉంటుందని ఆశిస్తున్నాను’’ అంటూ అనసూయ స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చింది. ప్రస్తుతం అనసూయ చేసిన ఈ పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. (Anasuya Reply to Netizen Post)

Updated Date - Jun 23 , 2024 | 07:57 PM