Harom Hara: ‘హరోం హరోం హర’ సాంగ్ ప్రోమో

ABN, Publish Date - Feb 13 , 2024 | 09:16 PM

హీరో సుధీర్ బాబు పాన్ ఇండియా చిత్రం ‘హరోం హర’. సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో ఎస్ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మాళవిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటివలే తెలుగు, మలయాళం, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో విడుదలైన ‘హరోం హర’ టీజర్ మంచి స్పందన రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ ‘హరోం హరోం హర’ సాంగ్ ప్రోమో విడుదల చేశారు.