Haddhu Ledhu Ra: ‘ఫ్రెండ్షిప్’ లిరికల్ సాంగ్

ABN, Publish Date - Feb 24 , 2024 | 07:52 PM

ఆశిష్‌ గాంధీ, అశోక్‌ హీరోలుగా వర్ష, హ్రితిక హీరోయిన్లుగా రాజశేఖర్ రావి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘హద్దు లేదురా’. టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వర్ణ పిక్చర్స్ బ్యానర్స్‌పై వీరేష్ గాజుల బళ్లారి నిర్మిస్తున్నారు. రావి మోహన్ రావు సహా నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ ‘ఫ్రెండ్షిప్’ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు.