Love Guru: ‘చెల్లెమ్మవే..’ లిరికల్ సాంగ్

ABN, Publish Date - Feb 23 , 2024 | 08:34 PM

విజయ్ ఆంటోనీ తొలిసారి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ జానర్‌లో నటిస్తున్న తమిళ ‘రోమియో’ మూవీ తెలుగులో ‘లవ్ గురు’గా విడుదల కాబోతోంది. మృణాళిని రవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘చెల్లెమ్మవే..’ అనే సిస్టర్ సెంటిమెంట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.