MixUpOnAha: మ‌రీ ఇంత ప‌చ్చిగానా! మిక్స‌ప్.. ఆహా ఓటీటీ ఒరిజిన‌ల్ మూవీ ట్రైల‌ర్

ABN, Publish Date - Mar 08 , 2024 | 06:54 PM

బిగ‌బాస్ ఫేం ఆద‌ర్శ్ బాల‌కృష్ణ‌న్ (Aadarsh B Krishna), క‌మ‌ల్ కామ‌రాజు (Kamal Kamaraju), పూజా జ‌వేరి (Pooja J Jhaveri), అక్ష‌ర గౌడ (Akshara Gowda) ప్ర‌ధాన పాత్ర‌ల్లో ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ నిర్మించిన చిత్రం మిక్స‌ప్ (MixUp On Aha). పూర్తిగా రోమాంటిక్‌, బోల్డ్ కంటెంట్‌తో వ‌స్తున్న ఈ చిత్రం టీజ‌ర్‌ను గ‌త నెల‌లో విడుద‌ల చేయ‌గా మంచి స్పంద‌న‌నే తెచ్చుకుంది. తాజాగా ఈ రోజు (శుక్ర‌వారం) సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.