Rajamouli On Premalu: ప్రేమ‌లు సినిమాపై.. రాజ‌మౌళి ఇలా కామెంట్ చేశాడేంట‌బ్బా!

ABN , Publish Date - Mar 08 , 2024 | 05:49 PM

ఇటీవ‌ల మ‌ల‌యాళంలో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్రం ప్రేమ‌లు. తాజాగా ఈ చిత్రాన్ని రాజ‌మౌళి కుమారుడు కార్తికేయ తెలుగులో అదే పేరుతో డ‌బ్‌ చేసి విడుద‌ల చేయ‌గా మంచి స్పంద‌న వ‌స్తుంది. అయితే ఈ సినిమాపై రాజ‌మౌళి సోష‌ల్ మీడియాలో చేసిన పోస్టు వైర‌ల్ అవుతోంది.

Rajamouli On Premalu: ప్రేమ‌లు సినిమాపై.. రాజ‌మౌళి ఇలా కామెంట్ చేశాడేంట‌బ్బా!

ఇటీవ‌ల మ‌ల‌యాళంలో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్రం ప్రేమ‌లు (Premalu Telugu). అంతా కొత్త వారితో రూపొందించిన ఈ చిత్రం థియేట‌ర్ల‌లో విడుద‌లైన మొద‌టిరోజు నుంచే మంచి పాజిటివ్ టాక్‌తో ర‌న్ అవుతూ కేర‌ళ‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న సినిమా రికార్డుల‌ను తిర‌గ‌రాస్తూ వ‌స్తోంది. నస్లెన్ (Naslen), మమిత బైజు (Mamitha Baiju), సంగీత్ ప్ర‌తాప్ (Sangeeth Pratap) ఇటీవ‌లే రూ.100 కోట్ల క‌లెక్ష‌న్ల మార్కును దాటిన ఈ సినిమా యూత్‌కు బాగా క‌నెక్ట‌వ‌డంతో భాషా భేదం లేకుండా తెగ చూసేస్తున్నారు. మ‌న తెలుగు ప్రేక్ష‌కులు ఇప్ప‌టికే ఒరిజిన‌ల్ మ‌ల‌యాళ వ‌ర్ష‌న్‌ను చాలామంది చూసిన‌ప్ప‌టికి తెలుగు డ‌బ్బింగ్ కోసం ఎదురు చూశారు.

premalu-1.jpg

తాజాగా ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి (rajamouli ss) కుమారుడు కార్తికేయ (Karthikeya) తెలుగులోనూ అదే పేరుతో డ‌బ్‌ చేసి ఈ రోజు (శుక్ర‌వారం) థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌గా అన్ని వ‌ర్గాల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది. ఇక్క‌డా కూడా యూత్‌తో సంబంధం లేకుండా చాలా మంది ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తు త‌మ సామాజిక మాధ్య‌మాల్లో పాజిటివ్ రివ్యూలు పెడుతున్నారు. ఈ క్ర‌మంలో కొద్దిసేప‌టి క్రిత‌మే రాజ‌మౌళి (rajamouli ss) ఈ చిత్రాన్ని చూసి త‌న‌దైన శైలిలో రివ్యూ ఇచ్చారు.


ప్రేమ‌లు (Premalu Telugu) సినిమాను కార్తికేయ‌ తెలుగులోకి తెచ్చినందుకు ఆనందంగా ఉంద‌ని.. సినిమా ఆద్యంతం న‌వ్వులు పూయించింద‌న్నారు. ముఖ్యంగా అదిత్యహ‌స‌న్ సినిమాకు అందించిన డైలాగ్స్ ఫ‌ర్ఫెక్ట్ సెట్ అయ్యాయ‌ని, నేటిడు ట్రెండింగ్‌లో ఉన్న మీమ్స్‌,యూత్ వాడుతున్న లాంగ్వేజ్‌ను బాగా వాడుకున్నార‌ని అన్నారు. అదేవిధంగా సినిమాలోని ప్ర‌ధాన పాత్ర రీనూ (Mamitha Baiju) ట్రైల‌ర్‌తోనే న‌న్ను ఆక‌ట్టుకుంద‌ని, హీరో స‌చిన్ (Naslen) కూడా బావున్నాడ‌న్నారు. కానీ సినిమాలో నాకు బాగా న‌చ్చిన పాత్ర ఆది అని.. జేకే.. జ‌స్ట్ కిడ్డింగ్ అంటూ పొగ‌డ్తల‌ వ‌ర్షం కురిపించారు.

Updated Date - Mar 08 , 2024 | 05:50 PM