విశ్వ‌క్‌, సిద్ధుల‌తో ‘దేవ‌ర‌’.. సోష‌ల్ మీడియాలో ర‌చ్చ‌

ABN , Publish Date - Apr 03 , 2024 | 03:23 PM

తాజాగా.. జూ.ఎన్టీఆర్, విశ్వ‌క్ సేన్‌, సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ లు క‌లిసి దిగిన ఫొటో సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తోంది. ఎక్స్‌లో ట్రెండ్ అవుతోంది

విశ్వ‌క్‌, సిద్ధుల‌తో ‘దేవ‌ర‌’.. సోష‌ల్ మీడియాలో ర‌చ్చ‌
ntr

ఇటీవ‌ల థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి సూప‌ర్ క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతున్న చిత్రం టిల్లు స్వ్కౌర్‌. విడుద‌లైన మొద‌టి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో 5 రోజుల్లోనే వంద కోట్ల క్ల‌బ్‌లో చేరింది. మెగాస్టార్ చిరంజీవి సైతం రెండు రోజుల క్రితం సినిమాను చూసి హీరో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌(Siddu Jonnalagadda) తో పాటు చిత్ర యూనిట్‌ను అభినందించిన విష‌యం తెలిసిందే.

1.jpeg

ఈక్ర‌మంలో తాజాగా ఈ సినిమాను ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ బాద్‌షా జూ.ఎన్టీఆర్ (Jr Ntr ) మంగ‌ళ‌వారం వీక్షించారు. అనంత‌రం మేక‌ర్స్‌కు అభినంద‌న‌లు తెలిపి ఆ చిత్ర హీరో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌(Siddu Jonnalagadda)తో ఓ ఫొటో సైతం దిగగా ఇప్పుడా ఫొటో సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది.

జైత్రీ.. అస‌లిది నువ్వేనా! మ‌రీ ఈ రేంజ్‌లోనా.. న‌మ్మ‌లేక‌పోతున్నాం

అయితే ఆ స‌మ‌యంలో వారితో పాటు ఇటీవ‌లే గామితో అల‌రించిన మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ (Vishwak Sen) కూడా వారితో క‌లిసి టిల్లు సినిమాను తిల‌కించారు.

2.jpeg


ఈ నేప‌థ్యంలోనే ఎన్టీర్‌కు వీరాభిమాని అయిన విశ్వ‌క్‌సేన్ (Vishwak Sen)..‘ల‌వ్ యూ తార‌క్ అన్నా’ అంటూ వారిద్ద‌రు క‌లిసి దిగిన ఫొటోను జ‌త చేసి సోష‌ల్ మీడియాలో పోస్టు చేశాడు. అంతేగాక‌ ఎన్టీఆర్ (Jr Ntr ) , విశ్వ‌క్ సేన్‌ (Vishwak Sen), సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ ((Siddu Jonnalagadda)) వీరంతా క‌లిసి దిగిన ఫొటోలు బ‌య‌ట‌కు రాగా సామాజిక మాధ్య‌మాల‌ను షేక్ చేస్తూ ఎక్స్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి.

3.jpeg

Updated Date - Apr 03 , 2024 | 03:25 PM