మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Family Star: విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్‌.. సెన్సార్ రిపోర్ట్ ఏంటంటే!

ABN, Publish Date - Apr 04 , 2024 | 08:24 PM

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించిన "ఫ్యామిలీ స్టార్" సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా సెన్సార్ నుంచి మంచి అప్డేట్ వ‌చ్చింది.

family star

స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటించిన "ఫ్యామిలీ స్టార్" (Family Star) సినిమా మరికొద్ది గంటల్లో వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. సకుటుంబంగా ప్రేక్షకులంతా కలిసి చూసేలా ఫ్యామిలీ స్టార్ సినిమా ఉండబోతోంది. ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందనే పాజిటివ్ వైబ్స్ అంతటా కనిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ఈ సినిమా కోసం అన్ని వర్గాల ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

The Family Star: అయ్య‌బాబోయ్‌.. ఫ్యామిలీస్టార్ రివ్యూస్ ఏంటి ఇలా ఉన్నాయ్‌

ఇదిలాఉండ‌గా.. ఈ సినిమాకు సెన్సార్ నుంచి క్లీన్ యు సర్టిఫికెట్ దక్కింది. కుటుంబ స‌మేతంగా చూసే చిత్రంగా చిత్రం ఉంద‌ని, ఫ్యామిలీ ఎమోష‌న్స్ బావున్నాయంటూ అభినంద‌న‌లు ద‌క్కాయి. అలానే సినిమా ఈచిత్రం 2 గంటల 30 నిమిషాల నిడివితో ఉండ‌నుంది.


"ఫ్యామిలీ స్టార్" సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. హోల్ సమ్ ఎంటర్ టైనర్ గా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పరశురామ్(Parasuram) పెట్ల రూపొందించారు.

విజయ్ (Vijay Deverakonda) సరసన మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ సినిమా రేపు ఘనంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది.

The Family Star: అయ్య‌బాబోయ్‌.. ఫ్యామిలీస్టార్ రివ్యూస్ ఏంటి ఇలా ఉన్నాయ్‌

Updated Date - Apr 05 , 2024 | 07:51 AM