Vijay Devarakonda: పుట్టినరోజు సందర్భంగా విజయ్‌ అప్‌ కమింగ్‌ అప్‌డేట్స్‌!

ABN , Publish Date - May 09 , 2024 | 02:08 PM

విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా నటించగా ఈ ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన ఫ్యామిలీ స్టార్‌ పరాజయం పాలైంది. దాంతో అలర్ట్‌ అయిన ఆయనిప్పుడు కొత్త కథలతో జర్నీ చేయబోతున్నారు.

Vijay Devarakonda: పుట్టినరోజు సందర్భంగా విజయ్‌ అప్‌ కమింగ్‌ అప్‌డేట్స్‌!

విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా నటించగా ఈ ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన ఫ్యామిలీ స్టార్‌ పరాజయం పాలైంది. దాంతో అలర్ట్‌ అయిన ఆయనిప్పుడు కొత్త కథలతో జర్నీ చేయబోతున్నారు. వరుస చిత్రాలను ప్రకటించి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. భవిష్యత్తులో కూడా మరిన్ని కొత్త నేపథ్యాల్ని, డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌ని టచ చేస్తూ ఆయన ముందుకెళ్లనున్నారు. ఓ స్పై థ్రిల్లర్‌, ఓ పీరియాడిక్‌ కథ, గ్రామీణ నేపథ్యంలో సాగే మరో చిత్రం... ఇలా విభిన్నమైన కథలతో సరికొత్త ప్రయాణం చేయడానికి ప్రణాళికలు సిద్థం చేసుకున్నారు విజయ్‌ దేవరకొండ. గురువారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న తాజాగా చిత్రాల అప్‌డేట్స్‌ సందడి చేస్తున్నాయి. ఆయా నిర్మాణ సంస్థలు విజయ్‌కు శుభాకాంక్షలు చెబుతూ కొత్త పోస్టర్లు విడుదల చేశారు. అవేంటో చూద్దాం.

Vd12_plain.jpg

ప్రస్తుతం గౌతమ్‌ తిన్ననూరి (Gowtham tinnanuri) దర్శకత్వంలో... స్పై థ్రిల్లర్‌ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ వైజాగ్‌లో జరుగుతోంది. ఇటీవల విజయ్‌ అక్కడికి చేరుకున్నారు. అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆయనపై కీలక సన్నివేశాల్ని దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. గురువారం తన పుట్టినరోజుని ఈ సినిమా సెట్లోనే జరుపుకోనున్నారు విజయ్‌. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.

Svc.jpeg

ఆ తర్వాత ఆయన మరో రెండు చిత్రాలు కమిట్‌ అయ్యారు. రాజావారు.. రాణిగారు ఫేం రవికిరణ్‌ కోలా (Ravi kiran kola) దర్శకత్వంలో... గ్రామీణ నేపథ్యంలో ఓ యాక్షన్‌ డ్రామా కథలో నటించనున్నారు. ఎస్వీసీ సంస్థలో వస్తున్న 59వ చిత్రమిది.భారీ పాన ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు నిర్మాత దిల్‌ రాజు. విజయ్‌ దేవరకొండకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమాను ప్రకటించారు. అనౌన్స్‌ మెంట్‌ సందర్భంగా రిలీజ్‌ చేసిన పోస్టర్‌లో విజయ్‌ కత్తి పట్టుకుని, వయలెంట్‌ మోడ్‌లో ఉన్నట్లు చూపించారు. ‘కత్తి నేనే, నెత్తురు నాదే, యుద్థం నాతోనే..’ అనే క్యాప్షన్‌ రాశారు. రూరల్‌ యాక్షన్‌ డ్రామా నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కనుంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన వివరాలు తెలియజేయనున్నారు.

VD-14.jpg

దీంతోపాటు మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలో... రాహుల్‌ సంకృత్యాన్‌ (Rahul Sankrithyan) దర్శకుడిగా ఓ సినిమా చేయనున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే పీరియాడిక్‌ డ్రామా ఇది. విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా గురువారం ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు. నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌ భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్నారు. వీడీ 14 అనౌన్స్‌ మెంట్‌ సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్‌ పోస్టర్‌ ఆసక్తి కలిగిస్తోంది. బీటలు వారిన పంట పొలాల్లో రాతిపై చెక్కిన వీరుడి విగ్రహం ఉంది. దాని మీద ది లెజెండ్‌ ఆఫ్‌ ది కర్స్డ్‌ ల్యాండ్‌ అని రాసి ఉంది. ఆయన జీవిత కాలం 1854 నుంచి 1878గా పేర్కొన్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1978 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

Updated Date - May 09 , 2024 | 02:09 PM