Varalakshmi Sarathkumar:‘జ‌య‌మ్మ’ పెళ్లి.. ఆహ్వనం అందుకున్న సినీ ప్ర‌ముఖులు వీరే

ABN , Publish Date - Jun 14 , 2024 | 10:38 AM

ప్ర‌ముఖ‌ న‌టి వ‌ర‌ల‌క్ష్మి త‌న ప్రియుడు ముంబాయికి చెందిన వ్యాపారవేత్త నిచోలై సచ్‌దేవ్‌తో పెళ్లి పీట‌లు ఎక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో శ‌ర‌త్ కుమార్‌, వ‌ర‌ల‌క్ష్మిలు స్వ‌యంగా అతిథుల‌ను క‌లుస్తూ వివాహ ఆహ్వ‌న ప‌త్రిక‌ల‌ను అంద‌జేస్తూ పెళ్లికి ఇన్‌వైట్ చేస్తున్నారు.

Varalakshmi Sarathkumar:‘జ‌య‌మ్మ’ పెళ్లి.. ఆహ్వనం అందుకున్న సినీ ప్ర‌ముఖులు వీరే
varalakshmi

GHqmd8qXgAAB4pq.jpeg

త‌మిళ స్టార్ శ‌ర‌త్‌కుమార్ గారాల ప‌ట్టి ప్ర‌ముఖ‌ న‌టి వ‌ర‌ల‌క్ష్మి (Varalakshmi Sarathkumar) త‌న ప్రియుడు ముంబాయికి చెందిన వ్యాపారవేత్త నిచోలై సచ్‌దేవ్‌తో క‌లిసి పెళ్లి పీట‌లు ఎక్క‌నున్న సంగ‌తి తెలిసిందే.

GP8t_SobkAAakKE.jpeg

ఇప్ప‌టికే ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ జంట జూలై మొద‌టి వారంలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ నేప‌థ్యంలో శ‌ర‌త్ కుమార్‌, వ‌ర‌ల‌క్ష్మిలు స్వ‌యంగా అతిథుల‌ను క‌లుస్తూ వివాహ ఆహ్వ‌న ప‌త్రిక‌ల‌ను అంద‌జేస్తూ పెళ్లికి ఇన్‌వైట్ చేస్తున్నారు.

GPyu-WDXoAAyOUh.jpeg


ఈక్ర‌మంలో శ‌ర‌త్ కుమార్‌, రాధిక‌, వ‌ర‌ల‌క్ష్మిలు చెన్నైలో అ రాష్ట సీఎం స్టాలిన్‌తో మొద‌లు పెట్టి ర‌జ‌నీకాంత్, క‌మ‌ల్ హ‌స‌న్ వంటి ప్ర‌ముఖుల‌కు స్వ‌యంగా వెళ్లి పెళ్లి ప‌త్రిక‌లు అందించారు.

GP8QdOBaEAAaFhC.jpeg

స‌మంత‌, న‌య‌న‌తార, సిద్ధార్థ్‌, ముర‌గ‌దాస్‌, క‌న్న‌డ స్టార్ సుదీప‌, అనుప‌మ్ కేర్‌ల‌తో పాటు తెలుగు నాట ర‌వితేజ‌, ద‌ర్శ‌కులు గోపీచంద్‌, వంశీ పైడిప‌ల్లి, ప్ర‌శాంత్ వ‌ర్మ‌, అడ‌వి శేష్, త‌మ‌న్‌

GP75hWPaUAAPU7z.jpeg

వంటి ప్ర‌ముఖుల‌కు వ‌ర‌ల‌క్ష్మి (Varalakshmi Sarathkumar) గురువారం ప్ర‌త్యేకంగా ఆహ్వాన ప‌త్రిక‌లు అంద‌జేసింది. ఇప్పుడీ ఫొటోలు నెట్టింట బాగా హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

టాలీవుడ్ సెల‌బ్రిటీస్‌కు.. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ పెళ్లి ప‌త్రిక‌లు (ఫొటోలు)

Updated Date - Jun 14 , 2024 | 11:02 AM