Ganja Shankar: సాయిధరమ్ తేజ్ ‘గాంజా శంకర్‌’‌కు ఆదిలోనే అడ్డంకులు

ABN , Publish Date - Feb 18 , 2024 | 12:59 PM

అసలే ఒకవైపు ‘గాంజా శంకర్‌’ సినిమా ఆగిపోయిందనే వార్తలు ఒకవైపు వినిపిస్తుంటే.. ఇప్పుడు తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో (TS NAB).. ఈ చిత్రయూనిట్ నోటీసులు జారీ చేసింది. దీంతో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ‘గాంజా శంకర్‌’‌కు ఆదిలోనే అడ్డంకులు అంటూ వార్తలు మొదలయ్యాయి. మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘గాంజా శంకర్’.

Ganja Shankar: సాయిధరమ్ తేజ్ ‘గాంజా శంకర్‌’‌కు ఆదిలోనే అడ్డంకులు
Ganja Shankar Poster

అసలే ఒకవైపు ‘గాంజా శంకర్‌’ (Ganja Shankar) సినిమా ఆగిపోయిందనే వార్తలు ఒకవైపు వినిపిస్తుంటే.. ఇప్పుడు తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో (TS NAB).. ఈ చిత్రయూనిట్ నోటీసులు జారీ చేసింది. దీంతో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ‘గాంజా శంకర్‌’‌కు ఆదిలోనే అడ్డంకులు అంటూ వార్తలు మొదలయ్యాయి. మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘గాంజా శంకర్’. ఈ సినిమాకు తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో (Telangana Anti Narcotics Bureau) పోలీసులు నోటీసులు ఇచ్చారు. అందుకు కారణం ఈ సినిమా టైటిలే.


Sampath.jpg

ఈ సినిమా పేరులో ఉన్న గాంజా (గంజాయి) అనే ప‌దాన్ని తొల‌గించాల‌ని.. అలాగే సినిమాలో మాదక ద్రవ్యాలకు సంబంధించిన సన్నివేశాలుంటే మాత్రం ఎన్డీపీఎస్‌-1985 చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి టైటిల్స్, సినిమాలు.. విద్యార్థులు, యువతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని.. సినిమాలో గంజాయి సీన్స్‌, దానిపై డైలాగ్స్ లేకుండా చూడాలని.. ఈ ముందస్తు నోటీసులో పేర్కొన్నారు. ఇంతకు ముందు‘బేబి’ (Baby) దర్శకనిర్మాతలకు ఇదే విషయంపై హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

====================

*Allu Arjun: 1, 2, 3.. పుష్ప కథను కొనసాగించాలనుకుంటున్నాం..

****************************

*Chiranjeevi: నా జీవన రేఖ.. భార్య సురేఖకు చిరు బర్త్‌డే విశెస్

*****************************

*Gaami: ఆసక్తికరంగా ‘గామి’ క్యారెక్టర్స్ టీజర్.. విశ్వక్ సేన్‌‌కే సమస్య!

******************************

Updated Date - Feb 18 , 2024 | 12:59 PM