Allu Arjun: 1, 2, 3.. పుష్ప కథను కొనసాగించాలనుకుంటున్నాం..

ABN , Publish Date - Feb 18 , 2024 | 11:59 AM

అల్లు అర్జున్‌ కెరీర్‌లోనే అతి పెద్ద విజయం సాధించిన చిత్రం ‘పుష్ప ది రైజ్‌’. దీనికి కొనసాగింపుగా వస్తున్న ‘పుష్ప ది రూల్‌’ చిత్రం ఆగస్ట్ 15న విడుదల కానుంది. దీనికి మూడో భాగం కూడా వస్తుందనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్‌ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. బెర్లిన్‌ 74వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొనడం కోసం ఆయన జర్మనీ వెళ్లిన విషయం తెలిసిందే. ‘పుష్ప ది రైజ్‌’ చిత్రాన్ని ఈ ఫెస్టివల్‌లో ప్రదర్శించినట్లుగా తెలుస్తోంది.

Allu Arjun: 1, 2, 3.. పుష్ప కథను కొనసాగించాలనుకుంటున్నాం..
Allu Arjun

అల్లు అర్జున్‌ (Allu Arjun) కెరీర్‌లోనే అతి పెద్ద విజయం సాధించిన చిత్రం ‘పుష్ప ది రైజ్‌’ (Pushpa The Rise). దీనికి కొనసాగింపుగా వస్తున్న ‘పుష్ప ది రూల్‌’ చిత్రం ఆగస్ట్ 15న విడుదల కానుంది. దీనికి మూడో భాగం కూడా వస్తుందనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్‌ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. బెర్లిన్‌ 74వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొనడం కోసం ఆయన జర్మనీ వెళ్లిన విషయం తెలిసిందే. ‘పుష్ప ది రైజ్‌’ చిత్రాన్ని ఈ ఫెస్టివల్‌లో ప్రదర్శించినట్లుగా తెలుస్తోంది. నిజంగా ఇది తెలుగు సినిమాకు దక్కిన గౌరవంగా అంతా భావిస్తున్నారు.

ఈ వేడుకలో పాల్గొనడానికి వెళ్లిన అల్లు అర్జున్‌.. అక్కడొక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ‘పుష్ప’ సినిమాపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘పుష్ప కథను కొనసాగించాలని అనుకుంటున్నాం. ‘పుష్ప’ పార్ట్‌ 3 తప్పకుండా ఉంటుంది. దానిని తెరపైకి ఎక్కించేందుకు అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయి’’ అని స్పష్టం చేశారు. ‘పుష్ప’ ఫ్రాంచైజ్‌ని కొనసాగించాలని అనుకుంటున్నట్లుగా బన్నీ చెప్పుకొచ్చారు. (Pushpa Part 3)


Bunny.jpg

ఇంకా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘‘విదేశాల్లోని ప్రేక్షకులు ‘పుష్ప’ చిత్రాన్ని ఎలా ఆదరిస్తారో చూడడానికే ఇక్కడకి వచ్చా. ఇక్కడి వారికి ఎలాంటి సినిమాలు కావాలో, వారి ఆలోచనలు ఎలా ఉంటాయో చూడాలి. మొదటి భాగం కంటే ‘పుష్ప’ రెండో భాగం (Pushpa2)లో పాత్రలు, వాటి మధ్య ఘర్షణ బలంగా ఉంటుంది. ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లర్‌ పుష్పరాజ్‌, పోలీస్‌ ఆఫీసర్‌ షెకావత్‌ల పాత్రలు, వాటి మధ్య సంఘర్షణ థ్రిల్లింగ్‌గా ఉంటాయి’’ అని తెలిపారు. (Pushpa 3)


ఇవి కూడా చదవండి:

====================

*Chiranjeevi: నా జీవన రేఖ.. భార్య సురేఖకు చిరు బర్త్‌డే విశెస్

*****************************

*Gaami: ఆసక్తికరంగా ‘గామి’ క్యారెక్టర్స్ టీజర్.. విశ్వక్ సేన్‌‌కే సమస్య!

******************************

*Aa Okkati Adakku: తండ్రి సినిమా టైటిల్‌కు ఫిక్సయిన అల్లరి నరేష్.. గ్లింప్స్ అదిరింది

**************************

Updated Date - Feb 18 , 2024 | 11:59 AM