తరుణ్ భాస్కర్ కొత్త‌ సినిమా ప్రారంభం.. సెట్‌లో ఈషా రెబ్బా బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌

ABN , Publish Date - Apr 19 , 2024 | 06:38 PM

త‌రుణ్ భాస్క‌ర్ మ‌రోసారి ఓ ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్‌లో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో ఈషా రెబ్బా థానాయికగా నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను మేకర్స్ ఈరోజు అధికారికంగా అనౌన్స్ చేశారు.

తరుణ్ భాస్కర్ కొత్త‌ సినిమా ప్రారంభం.. సెట్‌లో ఈషా రెబ్బా బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌
tharun bhaskar

ఇప్పటికే పలు మీకు మాత్ర‌మే చెప్తా అనే చిత్రం త‌ర్వాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ (Tharun Bhaskar) మ‌రోసారి ఓ ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్‌లో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్నారు. ఈ చిత్రంలో ఈషా రెబ్బా (Eesha rebba) కథానాయికగా నటిస్తోండ‌గా సంజీవ్ ఎఆర్(SanjeevAR) దర్శకత్వం వహిస్తున్నారు. సృజన్ యరబోలు, వివేక్ కృష్ణని, సాధిక్, ఆదిత్య పిట్టీ కలిసి ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ బ్యానర్‌లపై నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను మేకర్స్ ఈరోజు అధికారికంగా అనౌన్స్ చేశారు. అయితే ఈ చిత్రం ఓ మ‌ల‌యాళ సినిమాకు రిమేక్ అని నెట్టింట వార్త‌లు హ‌ల‌చ‌ల్ చేస్తునాయి.

eesha tharun.jpeg

రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఈ సినిమా మొదటి షూటింగ్ షెడ్యూల్ లో ప్రధాన తారాగణం పాల్గొంటోంది. ఇదిలాఉండ‌గా ఈరోజు (ఏప్రిల్ 19) హీరోయిన్ ఈషా రెబ్బా (Eesha rebba) పుట్టినరోజును సెట్స్‌ లో చిత్ర బృందం సెలబ్రేట్ చేసుకుంది. యూనిట్ విడుదల చేసిన స్టిల్‌లో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రూరల్ గెటప్‌లలో ఆకట్టుకున్నారు. తరుణ్ (Tharun Bhaskar) ఫార్మల్ డ్రెస్‌లో డీసెంట్‌గా కనిపిస్తుండగా, ఈషా సంప్రదాయ చీరను ధరించింది.

1e485b4c-70e0-4c25-aff2-221be3fe5eb1.jpeg


ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అక్టోబర్‌లో సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.ఈ చిత్రానికి దీపక్ యెరగరా సినిమాటోగ్రాఫర్ కాగా, జై క్రిష్ సంగీతం అందిస్తున్నారు. నంద కిషోర్ ఈమాని డైలాగ్ రైటర్.

eesha.jpeg

Updated Date - Apr 19 , 2024 | 06:54 PM