40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sundeep Kishan: ‘ఈగల్‌’ రిలీజ్‌ డేట్‌ విషయంలో మాకు ఎలాంటి కాల్స్ రాలేదు

ABN, Publish Date - Jan 18 , 2024 | 04:58 PM

హీరో సందీప్ కిషన్, ట్యాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్‌ల మోస్ట్ అవైటెడ్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తుండగా, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ని గురువారం విడుదల చేశారు. ఈ వేడుకలో రవితేజ ‘ఈగల్’తో క్లాష్ గురించి హీరో సందీప్ కిషన్ వివరణ ఇచ్చారు.

Sundeep Kishan

హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan), ట్యాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్‌ (VI Anand)ల మోస్ట్ అవైటెడ్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona). హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తుండగా, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ మంచి స్పందనను రాబట్టుకోగా, రెండు పాటలు- ‘నిజమే నే చెబుతున్నా, హమ్మా హమ్మా’ చార్ట్‌బస్టర్‌ హిట్స్‌గా నిలిచాయి. ఫిబ్రవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపధ్యంలో చిత్రయూనిట్ గురువారం గ్రాండ్‌గా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సినిమా గురించే కాకుండా.. మాస్ మహారాజా రవితేజ ‘ఈగల్’ సినిమాతో క్లాష్ గురించి కూడా సందీప్ కిషన్ మాట్లాడారు. (Ooru Peru Bhairavakona Trailer Launched)

ముందుగా సినిమా గురించి సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ‘‘తెలుగు సినిమా ముద్దు బిడ్డ, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు గారి వర్ధంతి నేడు. ఆయన్ని స్మరిస్తూ మా ట్రైలర్‌ని లాంచ్ చేశాం. దర్శకుడు విఐ ఆనంద్ అనుకున్న ప్రాజెక్ట్ అనుకున్నట్లుగా, ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని దాదాపు రెండున్నరేళ్ళు ఈ చిత్రం కోసం ఒక బాధ్యతతో పని చేశాం. ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలనే బాధ్యత ఎంత వుందో అంతకంత నిర్మాత అనిల్ సుంకరకి, రాజాకి, నాకు, సినిమాలో పని చేసి అందరికీ ఈ చిత్రం పెద్ద విజయం సాధించడం అంతే అవసరం ఉంది. ఆ బాధ్యతని, అవసరాన్ని ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ పని చేశాం. ఇందులో ‘నిజమే నే చెబుతున్నా’ పాట చాలా పెద్ద హిట్ అయ్యింది. దీనికి పూర్తి కారణం ప్రేక్షకుల ఆదరణ.. చాలా గొప్పగా ఆదరించారు. ఫిబ్రవరి 9న దెయ్యాలు, భూతాలు, మ్యాజిక్కు, మంచి హ్యుమర్, పాటలు, బోలెడంత యాక్షన్ వున్న చిత్రాన్ని ప్రేక్షకులు చూడబోతున్నారు. ‘ఊరు పేరు భైరవకోన’ కమర్షియల్లీ ప్యాకేజ్డ్ ఎంటర్‌టైనర్. ఫిబ్రవరి 9న సినిమా థియేటర్స్‌లోకి వస్తుంది. తప్పకుండా అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది’’ అని అన్నారు. (Ooru Peru Bhairavakona Trailer Launch Event)


‘ఈగల్’ సినిమాతో క్లాష్‌పై హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ‘‘మా సినిమా కూడా ఎప్పుడో పూర్తయింది. మేము కూడా సంక్రాంతికే రావాలని అనుకున్నాం. అయితే సంక్రాంతి రేసులో చాలా సినిమాలు ఉండటంతో.. ఇది సరైన సమయం కాదని ఫిబ్రవరికి వెళ్దామని నిర్ణయించుకున్నాం. ఫిబ్రవరి 9న ‘టిల్లు స్క్వేర్‌’ రిలీజ్ అని ప్రకటించారు. వాళ్లతో డిస్కస్ చేసిన తర్వాతే మేం రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేశాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో డేట్‌ మార్చుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే, ఇప్పటికే చాలా సమయం తీసుకున్నాం. రవితేజగారిని నేను అభిమానిస్తాను. వి.ఐ.ఆనంద్‌ ఇంతకు ముందు రవితేజగారితోనే సినిమా చేశారు. ‘ఈగల్‌’ సినిమాని నిర్మించిన పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలకు, మా నిర్మాతకు మధ్య స్నేహపూర్వక సంబంధాలే ఉన్నాయి. ‘ఈగల్‌’ రిలీజ్‌ డేట్‌ విషయంలో మాకు ఎలాంటి కాల్స్ రాలేదు. ఒకవేళ వాళ్లు ఫోన్‌ చేసి మాట్లాడి ఉంటే మాత్రం తప్పకుండా స్పందించేవాళ్లం..’’ అని చెప్పుకొచ్చారు. (Ooru Peru Bhairavakona vs Eagle)


ఇవి కూడా చదవండి:

====================

*NTR: ఎన్టీఆర్‌కు హాలీవుడ్, బాలీవుడ్ అవకాశాలు వచ్చినా తిరస్కరించారు.. ఎందుకంటే?

*******************************

*Pawan Kalyan: కన్నీరు తెప్పించావు.. జనసైనికుల లేఖలు చూసి పవన్ భావోద్వేగం

****************************

*Rajinikanth: రజనీ అభిమానులతో పొరుగింటి వృద్ధ మహిళ వాగ్వాదం

*************************

*ఎన్టీఆర్‌ అంటే నవరసాలకు అలంకారం: బాలకృష్ణ

**************************

Updated Date - Jan 18 , 2024 | 04:58 PM