Sitara Ghattamaneni: నాన్నకు నచ్చని విషయం అది..

ABN , Publish Date - May 26 , 2024 | 05:52 PM

ఇటీవల ఓ పెళ్లి వేడుకలో మహేశ్‌బాబు పాల్గొన్న వీడియో ఎంతగా వైరల్‌ అయిందో తెలిసిందే! అందులో తన సోదరి మంజుల.. జుట్టు పట్టుకుని లాగడం, దానికి మహేశ్‌ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ నెటిజన్లను ఎంతో ఆకర్షించాయి.

Sitara Ghattamaneni:  నాన్నకు నచ్చని విషయం అది..

ఇటీవల ఓ పెళ్లి వేడుకలో మహేశ్‌బాబు (Maheshbabu) పాల్గొన్న వీడియో ఎంతగా వైరల్‌ అయిందో తెలిసిందే! అందులో తన సోదరి మంజుల.. జుట్టు పట్టుకుని లాగడం, దానికి మహేశ్‌ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ నెటిజన్లను ఎంతో ఆకర్షించాయి. ఆ వీడియో చూసిన అభిమానులు మాత్రం అక్కా తమ్ముడి మధ్య బాండింగ్‌ అంటూ కామెంట్లు చేశారు. ఆ వీడియోలో మంజులను మహేశ్‌ను ఏమన్నారో ఎవరికీ తెలియదు. మహేశ్‌ కుమార్తె సితార (Sitara) నుంచి ఆ ప్రశ్నకు సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు. సితారతో వారు చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. ‘మీ డాడీ జుట్టుని మీ అత్తయ్య పట్టుకున్నప్పుడు ఏం జరిగింది?’ అని అడగ్గా.. ‘నా జుట్టు పట్టుకోవద్దు’ అని మహేశ్‌ అన్నారని సితార చెప్పింది. ఎవరైనా తన జుట్టు పట్టుకోవడం తన తండ్రికి ఇష్టం ఉండదని తెలిపింది.

Untitled-2.jpg

నటనపై ఆసక్తి ఉందని, సినిమాల్లోకి వస్తానని సితార తెలిపింది. నటన విషయంలో తన తండ్రిచ  ఫ్యాషన్‌లో తల్లి నమ్రతా శిరోద్కర్‌ తనకు స్ఫూర్తి అని పేర్కొంది. ఆ హెయిర్‌ స్టైల్‌ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కోసమని టాక్‌ నడుస్తోంది. ఎస్‌ఎస్‌ఎంబీ29 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం ఆగస్ట్‌ నుంచి సెట్స్‌ మీదకెళ్లనుందని సమాచారం. ఈ ఏడాది 7వ తరగతి చదవనున్న సితార.. తనకు నూడుల్స్‌ అంటే బాగా ఇష్టమని తెలిపింది. 

Updated Date - May 26 , 2024 | 05:53 PM