AAY: నాయ‌కి ఏమైనాదే.. మ‌రి రంగనాయ‌కి ఏమైనాదే! పాట‌.. అదిరిపోయిందిగా

ABN , Publish Date - May 26 , 2024 | 08:06 AM

GA2 పిక్చర్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.9గా రూపొందుతోన్న చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ క్ర‌మంలో శ‌నివారం మేక‌ర్స్ ఈ మూవీ నుంచి ‘రంగనాయకి’ అనే మాస్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.

AAY: నాయ‌కి ఏమైనాదే.. మ‌రి రంగనాయ‌కి ఏమైనాదే! పాట‌.. అదిరిపోయిందిగా
Aay

ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన ప్రతిష్టాత్మక సంస్థ GA2 పిక్చర్స్ (GA2 Pictures) బ్యానర్ ప్రొడక్షన్ నెం.9గా రూపొందుతోన్న చిత్రం ‘ఆయ్’(AAY). ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్ (Narne Nithiin), నయన్ సారిక (Nayan Sarika) జంటగా నటిస్తుండ‌గా,. అంజి కె.మ‌ణిపుత్ర (Anji K Maniputhra) దర్శకత్వం వ‌హించారు. బన్నీ వాస్‌, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సూప‌ర్ హిట్ పాట‌ల‌కు కేరాఫ్‌గా మారిన రామ్ మిర్యాల (Ram Miriyala) ఈ చిత్రానికి సంగీతాన్ని అందించ‌టం విశేషం.

అయితే ఆయ్ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ పక్కా ప్లానింగ్ ప్రకారం చేసుకుంటూ వస్తుంది. టైటిల్ రివీల్ సహా సినిమా కంటెంట్‌కు సంబంధించిన వీడియోలు, పోస్ట‌ర్స్‌, సాంగ్స్ అన్నింటికీ ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ క్ర‌మంలో శ‌నివారం మేక‌ర్స్ ఈ మూవీ నుంచి ‘రంగనాయకి’ (Ranganayaki )అనే మాస్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సాంగ్ ప్రోమోతో పాట‌పై మంచి హైప్ క్రియేట్ అయ్యింది.

Aay


తాజాగా విడుద‌లైన లిరిక‌ల్ సాంగ్ ప్రేక్ష‌కుల‌ను మ‌రింతంగా ఆక‌ట్టుకుంటోంది. మాస్ బీట్‌తో ఉన్న ఈ పాట‌ను వింటుంటే స్టెప్స్ వేయాల‌నిపించేలా ఉంది. సురేష్ బనిశెట్టి (Suresh Banisetti) రాసిన ఈ పాటను మోస్ట్ హ్యాపెనింగ్ సింగర్ అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni) ఆలపించారు. భాను మాస్టర్ నృత్య రీతుల‌ను స‌మ‌కూర్చారు. సెట్స్‌, ఆర్టిస్టుల డ్రెస్సింగ్ చాలా కల‌ర్‌ఫుల్‌గా ఉంది. న‌య‌న్ సారిక కూడా ఈ పాట‌లో క‌నిపించింది.

నితిన్ (Narne Nithiin), న‌య‌న్ సారిక (Nayan Sarika) జోడి సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూడ చ‌క్క‌గా ఉంది. ఈ సాంగ్‌ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంద‌న‌టంలో సందేహం లేదు. ‘ఆయ్’ సినిమాను ప్రారంభం నుంచి సరికొత్తగా ప్రమోట్ చేస్తున్నారు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇది టీమ్‌లో మరింత కాన్ఫిడెన్స్‌ను నింపుతోంది. ఈ డిఫరెంట్ ప్రమోషనల్ యాక్టివిటీస్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతోన్న ఈ సినిమాకు కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా, సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్‌గా, వర్క్ చేశారు. త్వ‌ర‌లో సినిమాను విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.

Updated Date - May 26 , 2024 | 08:06 AM