మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Robinhood: యునీక్‌ యాక్షన్ సీక్వెన్స్... వచ్చేది ఎక్కడంటే!

ABN , Publish Date - Mar 02 , 2024 | 08:02 PM

‘భీష్మ’లాంటి హిట్‌ సినిమా తర్వాత నితిన్, వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తోన్న చిత్రం 'రాబిన్‌హుడ్‌’. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న హ్యుమర్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌లో నితిన్‌ దొంగగా నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిర క్యారెక్టర్‌ టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది

 Robinhood: యునీక్‌ యాక్షన్ సీక్వెన్స్... వచ్చేది ఎక్కడంటే!


‘భీష్మ’లాంటి హిట్‌ సినిమా తర్వాత నితిన్(Nithin), వెంకీ కుడుముల (Venki kudumula) దర్శకత్వంలో వస్తోన్న చిత్రం 'రాబిన్‌హుడ్‌’ (Robinhood). మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న హ్యుమర్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌లో నితిన్‌ దొంగగా నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిర క్యారెక్టర్‌ టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. నితిన్‌ పాత్రను చాలా డిఫరెంట్‌గా ప్రజెంట్‌ చేస్తునట్లు ఆ లుక్‌ చూస్తే అర్థమైంది. పాత్ర సీరియస్‌ అయినా అతని లుక్‌ ఫన్  క్రియేట్‌ చేస్తుంది. తాజాగా టీమ్‌ ఇంటర్వెల్‌ యాక్షన్‌ ఎపిసోడ్‌ షూటింగ్‌ ప్రారంభించింది. ఎప్పుడూ డిఫరెంట్‌ యాక్షన్  కాన్సెప్ట్‌తో వచ్చే రామ్‌-లక్ష్మణ్‌ మాస్టర్స్‌ ఈ యూనిక్‌ యాక్షన్‌ బ్లాక్‌ని ఇంట్రస్టింగ్‌గా డిజైన్‌ చేశారు.

Nithin.jpg

ఇంటర్వెల్‌లో రానున్న ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం స్పెషల్‌ కేర్‌ తీసుకుంటున్నారు. నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌ నిర్మాతలుగా  వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత జివి ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. గ్లింప్స్‌ కోసం అద్భుతమైన నేపధ్య సంగీతం అందించారు.

Updated Date - Mar 02 , 2024 | 08:13 PM