RaviTeja Sreeleela: ర‌వితేజ.. శ్రీలీల‌ కొత్త‌గా మొద‌లు పెట్టారుగా

ABN , Publish Date - Jun 11 , 2024 | 11:35 AM

మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంట‌గా తెర‌కెక్క‌నున్న కొత్త చిత్రం మంగ‌ళ‌వారం జూన్ 11వ తేదీన ఉదయం 07:29 గంటలకు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు షాట్ కి శ్రీలీల క్లాప్ కొట్టగా, భాను బోగవరపు దర్శకత్వం వహించారు.

RaviTeja Sreeleela: ర‌వితేజ.. శ్రీలీల‌ కొత్త‌గా మొద‌లు పెట్టారుగా
sreeleela

మాస్ మహారాజా రవితేజ (RaviTeja), శ్రీలీల (Sreeleela) జంట‌గా తెరెక్క‌నున్న కొత్త చిత్రం మంగ‌ళ‌వారం జూన్ 11వ తేదీన ఉదయం 07:29 గంటలకు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు షాట్ కి శ్రీలీల (Sreeleela) క్లాప్ కొట్టగా, భాను బోగవరపు (Bhanu Bhogavarapu) దర్శకత్వం వహించారు.

sreeleela

ర‌వితేజ 75వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర‌ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. నేటి నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగ‌నుంది. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

sreeleela

ఎందరో ఔత్సాహిక దర్శకులకు, నటీనటులకు స్ఫూర్తిగా ఉంటున్న మాస్ మహారాజా రవితేజ (RaviTeja) యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు. ఈక్ర‌మంలో ఇప్పుడు రచయితగా అనతి కాలంలోనే తనదైన ముద్ర వేసిన భాను బోగవరపు (Bhanu Bhogavarapu) ద‌ర్శ‌కుడిగా ఈ చిత్రంతో పరిచయం అవబోతుండ‌డం విశేషం.

sreeleela

గ‌తంలో బ్లాక్ బస్టర్ చిత్రం 'వాల్తేరు వీరయ్య'కి మాటల రచయితగా, మరో బ్లాక్ బస్టర్ 'సామజవరగమన'కు కథ, స్క్రీన్‌ప్లే రచయితగా పని చేసి భాను మంచి గుర్తింపు తెచ్చుకున్నారు బోగవరపు. ప్ర‌స్తుతం నందమూరి బాలకృష్ణ కథనాయకుడిగా తెరకెక్కుతోన్న 'NBK109'కి సంభాషణలు అందిస్తున్నారు.


sreeleela

మాస్, కామెడీ. తనదైన యాటిట్యూడ్, టైమింగ్ తో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న రవితేజ (RaviTeja) తన 75వ చిత్రంలో హాస్యంతో కూడిన మాస్ పాత్రలో కనిపించనున్నారని చిత్ర బృందం వెల్లడించింది. చాలాకాలం నుంచి రవితేజను వినోదంతో కూడిన పూర్తిస్థాయి మాస్ పాత్రలో చూడాలని అనుకుంటున్న‌ అభిమానుల కోరిక ఈ చిత్రంతో నెరవేరుతుందని చిత్ర బృందం స్ప‌ష్టం చేసింది.

sreeleela

ఈ సినిమాలో ర‌వితేజ స‌ర‌స‌న‌ ఈ సినిమాలో యువ సంచలనం శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. వీరిద్ద‌రి జోడి గతంలో "ధమాకా"తో బ్లాక్ బస్టర్ హిట్ అందించారు. ఆ చిత్ర‌ విజయంలో కీలకపాత్ర పోషించిన సంగీత ద‌ర్శ‌కుడు భీమ్స్ సిసిరోలియో (Bheem Sceciroleo) ఈ చిత్రానికి కూడా సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

Updated Date - Jun 11 , 2024 | 12:13 PM