Eagle: నెటిజన్ల స్పందన ఎలా ఉందంటే..

ABN , Publish Date - Feb 09 , 2024 | 10:54 AM

మాస్‌ మహారాజా రవితేజ కథానాయకుడిగా కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై  టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మించిన చిత్రం 'ఈగల్‌'. కావ్య థాపర్‌, అనుపమ పరమేశ్వరన్‌ కథానాయికలు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌, పాటలకు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. 

Eagle: నెటిజన్ల స్పందన ఎలా ఉందంటే..

మాస్‌ మహారాజా రవితేజ (Ravi teja) కథానాయకుడిగా కార్తీక్‌ ఘట్టమనేని (Karthik ghattamaneni) దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై  టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మించిన చిత్రం 'ఈగల్‌'. కావ్య థాపర్‌, అనుపమ పరమేశ్వరన్‌ కథానాయికలు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌, పాటలకు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది.  యాక్షన్  ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే పలు చోట్ల ఫస్ట్‌ షో ప్రదర్శితమైంది. సినిమాను వీక్షించిన ప్రేక్షకులు ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 

ట్విట్టర్‌లో కొందరు నెటిజన్లు సినిమా బావుంది అంటుంటే.. మరికొందరు మిశ్రమ స్పందనగా చెబుతున్నారు.  యాక్షన్‌ సీన్స్‌ మాత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయని చెబుతున్నారు. మరికొందరైతే రెగ్యులర్‌ మాస్‌ సినిమా అని,  యావరేజ్‌ అని అంటున్నారు. హీరో ఎలివేషన్‌ సీన్స్  మీదే దర్శకుడు ఎక్కువగా దృష్టిపెట్టాడని కామెంట్‌ చేస్తున్నారు. యాక్షన్   సన్నివేశాల్లో బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అంత ఆకట్టుకోలేదని రాసుకొస్తున్నారు. యాక్షన్ సీన్స్ తో పాటు సెకెండాఫ్‌ అవుట్‌ స్టాండింగ్‌గా  ఉందనీ, సినిమా క్వాలిటీ అద్భుతం అని మరో నెటిజెన్  రాశారు.


Updated Date - Feb 09 , 2024 | 12:21 PM