Ravi Teja: తీవ్రమైన మెడ నొప్పితో కూడా.. తగ్గలేదు!

ABN , Publish Date - Jun 14 , 2024 | 09:29 PM

మాస్‌ మహరాజా రవితేజ (Raviteja) డెడికేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తుంటారు. ప్రస్తుతం మాస్‌ మాహారాజా రవితేజ నటిస్తున్న సినిమా 'మిస్టర్‌ బచ్చన్‌’

Ravi Teja: తీవ్రమైన మెడ నొప్పితో కూడా.. తగ్గలేదు!


మాస్‌ మహరాజా రవితేజ (Raviteja) డెడికేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తుంటారు. ప్రస్తుతం మాస్‌ మాహారాజా రవితేజ నటిస్తున్న సినిమా 'మిస్టర్‌ బచ్చన్‌’ (Mr. Bachchan). పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రానికి హరీశ్‌ శంకర్‌ (HArish Shankar)దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. తాజాగా  హరీశ్‌   శంకర్‌ చేసిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. అందులో రవితేజ పై ప్రశంసలు కురిపిస్తూ కొన్ని ఫోటోస్‌ షేర్‌ చేశారు. ఆ ఫొటోలో రవితేజ తీవ్రమైన మెడ నొప్పితో బాధపడుతూ కనిపించారు. మెడ నొప్పి తగ్గడానికి మెడపై బ్యాండ్‌ పెట్టుకుని కూర్చోగా.. హరీశ్‌ శంకర్‌ పక్కనే బ్యాండ్‌ పట్టుకుని కూర్చున్నాడు.

ఈ ఫోటోను షేర్‌ చేసి ‘‘మాస్‌ మాహారాజా డెడికేషన్‌కు హ్యాట్స్‌ ఆఫ్‌. తీవ్రమైన మెడ నొప్పితో బాధపడుతున్నా షూటింగ్‌ చేస్తున్నారు. థాంక్యూ అన్నయ్య. ప్రతి రోజు మమ్మల్ని ఇన్‌స్పైర్‌ చేస్తావు’’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం హరీశ్‌ శంకర్‌ చేసిన పోస్ట్‌ నెట్టింట వైరలవుతుంది. దీంతో రవితేజ ఫ్యాన్స్‌ రియాక్ట్‌ అవుతూ 'నొప్పితో ఉన్నప్పుడు కాస్త రెస్ట్‌ తీసుకోవచ్చు కదా అన్నయ్య’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. హరీశ్‌ శంకర్‌, రవితేజ కాంబోలో వస్తున్న మూడో చిత్రమిది. భాగ్యశ్రీ బోర్సె కథానాయికగా నటిస్తుంది. బాలీవుడ్‌ ఇండస్ట్రీలో  సూపర్‌ హిట్‌ అయిన రైడ్‌ సినిమాకు రీమేక్‌గా వస్తున్న మూవీ ఇది. ఇందులో అమితాబ్‌ బచ్చన్ కు  రవితేజ పెద్ద ఫ్యాన్  గా  కనిపించనున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్‌ 27న రిలీజ్‌ చేయడానికి ప్లాన చేస్తున్నారు మేకర్స్‌. 

Updated Date - Jun 14 , 2024 | 09:29 PM